రామ్‌ చరణ్ ఎవరికి భయపడతారు… చిరంజీవికా?.. ఉపాసనాకా..??

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘ఆచార‍్య’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్‌ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్‌, పోస్టర్లు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో స్పీడు పెంచింది ‘ఆచార్య’ చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ శనివారం (ఏప్రిల్‌ 23) యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఆహ్లాదకరంగా సాగింది.

Funny moments in acharya pre release event

ఈ ఈవెంట్‌కి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మెగా ఈవెంట్‌కు సుమ కనకాల హోస్ట్‌గా వ్యవహరించారు. సుమ ఉంటే ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. అభిమానుల తరఫున చిరంజీవి, రామ్‌ చ‌ర‌ణ్, కొర‌టాల శివలను ప్రశ్నలను అడిగి అలరించారు. ఇందులో కొన్ని ఫన్నీగా ఉన్నాయి.  రామ్‌ చరణ్‌కు సుమ ఓ ప్రశ్న వేయగా.. చాలా తెలివిగా మెగా పవర్ స్టార్ బదులిచ్చాడు. ఇంట్లో ఎవరికీ భయపడతారు నాన్నకా? ఉపాసనకా? అని అడగగా.. ‘తెలియదు గానీ ఓ విషయం చెపుతా. అమ్మ ముందు నాన్న జాగ్రత్తగా ఉంటారు. నేను కూడా అదే నేర్చుకుని.. ఉపాసన దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటా. బాబాయికైనా, డాడీకైనా, నాకైనా.. మా అందరికీ బాసు మా అమ్మే’ అని చరణ్ చెప్పాడు.

ఈ సమాధానం విన్న చిరంజీవి.. ‘అది నన్ను చూసి నేర్చుకున్నావ్‌. సుఖపడతావ్‌. వాళ్లతో పెట్టుకోవద్దు’ అని నవ్వుతూ అన్నారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసిన ఉపాసన ‘హుమ్.. మిస్టర్ సి, గుర్తుపెట్టుకుంటా’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ‘ఆచార్య’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఉపాసన కూడా హాజరైంది. కానీ స్టేజ్ పైకి మాత్రం వెళ్లలేదు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *