తన తల్లి విషయంలో ఎమోషనల్ అయిన చిరంజీవి!

Chiranjeevi: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. 150 చిత్రాలకు పైగా నటించి తన బ్రేక్ డాన్స్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక చిరూ.. ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర స్టార్ హీరోలలో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. మెగాస్టార్ రాజకీయంగా కూడా ఒక మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు.

ఇదిలా ఉంటే చిరంజీవికి ఇటీవలే కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో క్వారంటైన్ లో ఉన్నాడు. తాజాగా తల్లి విషయంలో కాస్త ఎమోషనల్ అయ్యాడు. తన తల్లి అంజనాదేవిని కలవలేకపోతున్నానని బాధపడ్డాడు. అంతేకాకుండా శనివారం రోజు తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు.

ఈ మేరకు తన తల్లి, భార్య తో గతంలో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. “అమ్మ నీకు జన్మదిన శుభాకాంక్షలు క్వారంటైన్ లో ఉన్నందుకు ప్రత్యక్షంగా నిన్ను కలిసి నీ ఆశీస్సులు పొందలేకపోతున్నాను. నీ చల్లని బ్లెస్సింగ్స్ ఈ జన్మ కే కాదు.. జన్మ జన్మలకి కావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా ప్రేమతో.. శంకర్ బాబు” అని చిరంజీవి తన ట్విట్టర్ లో మెన్షన్ చేసాడు. ప్రస్తుతం చిరంజీవి క్వారంటైన్ లో ఉండడం వల్ల ‘భోళా శంకర్’ సినిమా షూటింగ్ కు పుల్ స్టాప్ పడినట్లు తెలుస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *