డ్రస్సింగ్‌పై ట్రోలింగ్‌.. ఇచ్చిపడేసిన సమంత..!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత… ఇప్పుడు కెరీర్‌లో మంచి జోష్ మీదుంది. విడాకుల తర్వాత మరిన్ని ఆఫర్లను అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమెపై ఎన్నెన్నో విమర్శలు వస్తున్నాయి. వ్యక్తిగత విషయాలు, వస్త్రధారణపైనా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ‘క్రిటిక్స్‌ ఛాయిస్‌’ అవార్డుల ప్రదానోత్సవం నిమిత్తం నటి సమంత ఇటీవల ముంబయిలో తళుక్కున మెరిశారు. సుమారు రూ.2లక్షల ఖరీదు చేసే గ్రీన్‌ కలర్‌ లాంగ్‌ వెస్ట్రన్‌ ఫ్రాక్‌తో ఈ షోలో ఆమె సందడి చేశారు. ఆ ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

samantha strong counter to trollers

అయితే, ఆమె డ్రెస్సింగ్ పై కొందరు నెటిజన్లు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. విడాకుల అనంతరం సామ్‌ కొత్తగా ప్రవర్తిస్తున్నారని.. ఆమె వస్త్రాధారణలో మార్పులు వచ్చాయంటూ నెగెటివ్‌ కామెంట్స్‌ చేయడం ప్రారంభించారు. దానికి సమంత స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చింది. ఎదుటి మహిళలపై కామెంట్లు చేయడానికి బదులు తమ మెరుగుదల గురించి ఆలోచిస్తే బాగుంటుందని చురకలంటించింది. ‘‘ఓ మహిళగా మహిళపై వచ్చే విమర్శల గురించి స్వతహాగా నాకు బాగా తెలుసు. మహిళలు ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నారు, వారి జాతి, విద్య, సామాజిక హోదా, లుక్స్, చర్మం రంగు వంటి వాటిని ఆధారంగా చేసుకుని మహిళలను విమర్శిస్తున్నారు. చెబుతూ పోతే ఆ లిస్టు ఇంకా ఎక్కువే ఉంటుంది. అయితే, వేసుకున్న దుస్తుల ఆధారంగా మహిళను జడ్జ్ చేయడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైపోతోంది’’ అని పేర్కొంది.

samantha strong counter to trollers

‘మనం 2022లో ఉన్నాం. ఇప్పటికీ స్త్రీలను జడ్జ్ చేయడం మానరా? స్త్రీలపై కామెంట్లు చేయడం మాని మన పని మనం చేసుకోలేమా? మీ అభిప్రాయాలు రుద్దడం వల్ల ఒరిగేదేమీ లేదు’ అంటూ తన ఇన్‌స్టా స్టేటస్లో పెట్టింది. తనపై వచ్చిన ట్రోలింగ్ విషయంలోనే ఆమె అలా స్పందించింది. ఇకనైనా సమంతను ట్రోల్ చేయడం ఆపుతారో ఆపరో చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *