ముంబైలో గ్రాండ్ గా ఆర్‌ఆర్‌ఆర్ ఈవెంట్… గెస్ట్ గా సల్మాన్ ఖాన్

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా “ఆర్ఆర్ఆర్”. మెగా పవర్​స్టార్​ రామ్ చరణ్, జూనియర్​ ఎన్టీఆర్ హీరోలుగా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. నందమూరి, మెగా ఫ్యామిలి లకు సంబంధించిన ఇద్దరు హీరోలు మొదటి సారిగా కలిసి నటించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్​కు భారీ స్పందన లభించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో “ఆర్ఆర్ఆర్ ” టీం డిఫరెంట్ వేరియేషన్స్ లో ప్రమోషన్స్ ను చేస్తుంది.

salman khan attend as a chief guest for rrr event in mumbai

ఇందులో భాగంగానే… ఆర్ఆర్ఆర్ ఇన్ ముంబై పేరుతో నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్‌ను లైవ్ టెలికాస్ట్ చేయలేదు. కానీ, అత్యంత వైభవంగా ఈ ఫంక్షన్ ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేజి మీదకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలా అలా గాల్లోంచి ఎంట్రీ ఇస్తే చూడటానికి రెండు కళ్లు చాల్లేదని, నోట మాట రాలేదని తెలుగు రాష్ట్రాల నుంచి ముంబై వెళ్లిన అభిమానులు చెబుతున్నారు. రామ్ చరణ్ అభిమానులు స్టేజి మీదకు ఇద్దరు హీరోల ఎంట్రీ వీడియో తీసి ట్వీట్ చేశారు. కార్యక్రమంలో వాళ్లిద్దరి ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలుస్తోంది. రామ్ చరణ్ కోసం గుర్రం తరహాలో ఒకటి, ఎన్టీఆర్ కోసం బైక్ లాంటిది డిజైన్ చేశారు అని సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రముఖ హిందీ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డిసెంబర్ 31న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈవెంట్ టెలికాస్ట్ కానుందని సమాచారం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *