‘తోలు తీస్తా, ఏం పీకుతావో చూస్తా’.. యాంకర్‌ శివకి గట్టి వార్నింగ్‌

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో హాట్‌ స్టార్‌ వేదికగా 24గంటలు ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హౌజ్‌లో వాడీ వేడి రచ్చ జరుగుతోంది. తాజాగా బిగ్‌ బాస్‌ కెప్టెన్సీ టాస్క్‌ ఇవ్వటంతో అది కాస్త నిప్పు రవ్వలా అంటుకుంది.

Bigboss ott nataraj master fires on anchor shiva in captaincy task

కెప్టెన్సీ టాస్క్ పోటీదారుల కోసం బిగ్ బాస్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్‌కి కొన్ని టాస్క్ లు ఇచ్చారు. ముందుగా ‘దమ్ముంటే చేసి చూపించు’ అనే ఈ టాస్క్‌లో రెండు జట్లు బరిలోకి దిగాయి. చివరకి వారియర్స్ టీమ్ లీడ్‌లో ఉండడంతో ఆ గ్రూప్ నుంచి కెప్టెన్సీ పోటీదారుల పేర్లను అనౌన్స్ చేయమని బిగ్ బాస్ చెప్పగా.. అందరూ కలిసి మహేష్ విట్టా, తేజస్వి పేర్లు చెప్పారు.  ఆ తరువాత కెప్టెన్సీ పోటీదారుల కోసం మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. టాస్క్‌లో భాగంగా.. ఒక్కో టీమ్ నుంచి ముగ్గురు చొప్పున పోటీ పడాల్సి ఉంటుంది. స్టిక్కర్లు అతికించుకునే ఈ టాస్క్‌లో వారియర్స్ టీమ్‌కి సంచాలక్‌గా ముమైత్, ఛాలెంజర్స్ టీమ్‌కి సంచాలక్‌గా శివ వ్యవహరించారు. ఏ టీమ్ అయితే ఎక్కువ స్టిక్కర్లను అవతలి టీమ్ వాళ్లపై అంటిస్తుందో వాళ్లే విజేతలు. ఈ టాస్క్ మొదలైన దగ్గర నుంచి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ టాస్క్‌లో అఖిల్‌, బిందు మాధవికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. తాను ఫిజికల్‌ అయితే మామూలుగా ఉండదంటూ హీరోయిన్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు అఖిల్‌. మరో పక్క నటరాజ్‌ మాస్టర్‌, యాంకర్‌ శివ దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. రా అన్నావంటే తోలు తీస్తా, ఏం పీకుతావో చూస్తా అంటూ యాంకర్‌ శివ పైపైకి వెళ్లాడు నటరాజ్‌ మాస్టర్‌. దీంతో మిగతా హౌస్‌మేట్స్‌ వారిని కూల్‌ చేసేందుకు చాలానే ప్రయత్నించారు. ఫైనల్‌గా మహేశ్‌, తేజస్వి, నటరాజ్‌, సరయు మొదటి వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. మరి వీరిలో ఎవరు కెప్టెన్‌ అవుతారో చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *