బాలయ్య బర్త్‌ డే సర్‌ప్రైజ్ అదిరింది.. చూశారా మీరు..?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. శ్రుతి హాసన్‌ కథానాయికగా కనిపించనున్న ఈ మూవీలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ముఖ్య పాత్ర పోషిస్తోంది. కన్నడ స్టార్‌ దునియా విజయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. శుక్రవారం బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా గురువారం ‘ఫస్ట్‌ హంట్‌’ పేరుతో ఈ చిత్ర టీజర్‌ విడుదల చేశారు.

Nandamuri Balakrishna Birthday Celebrations

ఇందులో బాలకృష్ణ నెరిసిన గడ్డం, కొత్త హెయిర్‌ స్టైల్‌తో సరికొత్తగా కనిపించారు. ఆయన ఆహార్యంతో పాటు పలికిన సంభాషణలు, చేసిన పోరాట ఘట్టాలు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ప్రచార చిత్రంలో కనిపించిన సన్నివేశాల్ని బట్టి.. పులిచర్ల నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ‘‘నీ జీవో గవర్నమెంట్‌ ఆర్డర్‌. నా జీవో గాడ్స్‌ ఆర్డర్‌’’.. అంటూ టీజర్‌లో బాలయ్య పలికిన సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి.

ఇక బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆహా’ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ షో ఫైనాలేకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ టీమ్ బాలయ్యను ప్రత్యేకంగా విష్ చేసింది. ఫినాలేలో పాల్గొన్న సింగర్ ఉష ఉతప్పతోపాటు ఈ షోకు జడ్జెస్‌గా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు తమన్, గాయకుడు కార్తిక్‌లు బాలకృష్ణ కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత వేదికపైన ఏర్పాటు చేసిన కేకు వద్దకు తీసుకెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చారు. బాలకృష్ణ కేక్ కట్ చేయగా పోటీల్లో పాల్గొన్న సింగర్స్, జడ్జెస్ బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *