మహేశ్‌బాబు లాంచ్‌ చేసిన ఈ ఫన్నీ ట్రైలర్‌ చూశారా?

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్ఎస్‌జే తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం మిష‌న్ ఇంపాజిబ‌ల్. బాలీవుడ్ భామ తాప్సీ ప‌న్ను మెయిన్ రోల్ చేస్తోంది. చాలాకాలం తర్వాత ఈమె తెలుగు సినిమా చేస్తుంది. వేసవి కానుకగా ఏప్రిల్ 1న ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాప్సీతో పాటు సినిమాలో మరో ముగ్గురు బాలలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను మ‌హేశ్ బాబు లాంఛ్ చేశాడు.

అరెస్ట్, ఇన్‌ఫ్లుయెన్స్, బెయిల్.. ఈ సైకిల్ బాగా అల‌వాటు వీడికి అంటూ తాప్సీ మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ గురించి చెప్తున్న సంభాష‌ణ‌ల‌తో మొద‌లైంది ట్రైల‌ర్‌. దావూద్ ని పట్టుకుంటే ప్రభుత్వం రూ.50 లక్షలు ఇస్తుందని పేపర్ లో చదివిన ముగ్గురు పిల్లలు డబ్బు కోసం దావూద్ ని వెతకడానికి బయలుదేరతారు. అలాంటి వారిని తన మిషన్ కోసం వాడుకుందామని ఫిక్స్ అవుతుంది తాప్సీ. ఇంతకీ ఆ మిషన్ ఏంటి..? ఆ ముగ్గురు పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనేదే సినిమా. క్రిమిన‌ల్‌ను ప‌ట్టుకునే క్ర‌మంలో జ‌రిగే ప్ర‌యాణం నేప‌థ్యంలో ఎదుర్కొన్న సంఘ‌ట‌న‌లతో ఫ‌న్నీగా సాగుతున్న ట్రైల‌ర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది.

తిరుపతికి సమీపంలోని ఓ మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంతో సినిమా రూపొందించినట్టు చిత్ర బృందం పేర్కొంది.  ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ విభిన్న కథా చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళీ నటుడు హరీశ్‌, కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి ఇందులో కీలక పాత్ర పోషించారు .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *