తనను చౌకబారు అన్నందుకు అదిరిపోయే సమాధానమిచ్చిన లావణ్య త్రిపాఠి!

Lavanya Tripathi: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ.. ఆ సినిమాతోనే ఎంతో మంది యువకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది ఈ బ్యూటీ.

Lavanya Tripathi
Lavanya Tripathi

ఇక ఆ క్రమంలోనే లావణ్య కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. లావణ్య సోషల్ మీడియాలో కూడా బాగా హడావిడి చేస్తుంది. ఇదిలా ఉంటే లావణ్య తాజాగా నెటిజన్ నోట్లో పడింది. దానికి లావణ్య త్రిపాఠి కూడా ఆ నెటిజన్ కు అదిరిపోయే రిప్లై ఇచ్చింది. అసలు జరిగింది ఏమిటి అంటే..

తమిళనాడులో క్రిస్టియన్ మతం తీసుకున్నందుకు ఒక మైనర్ బాలికను వేధింపులకు గురి చేశారు. ఆ బాలిక పేరు లావణ్య. దాంతో ఆ అమ్మాయి తట్టుకోలేక చనిపోయింది. ఇక ఆ అమ్మాయికి న్యాయం చేస్తూ సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ లతో షేర్ చేస్తున్నారు. అందులో కొందరు అనుకోకుండా హీరోయిన్ లావణ్య త్రిపాఠి పేరును టాగ్ చేసారు.

లావణ్య త్రిపాఠి పేరును టాగ్ చేసినందుకు ఓ నెటిజన్ ఇలా స్పందించాడు. ‘చనిపోయిన మైనర్ బాలిక ధర్మం కోసం చనిపోతే.. ఆమెను చౌక బార నటితో ఎందుకు పోలుస్తున్నారు అని కామెంట్ చేసాడు. దీనికి లావణ్య ఇలా స్పందించింది.

‘ఏదైనా చెడు జరిగినప్పుడు మాత్రమే మీలాంటి వాళ్లు మహిళలను గౌరవిస్తారు. అంతకుముందు మీలాంటి వాళ్లే మహిళలను చౌకబారు అని అంటారు’ అని అదిరిపోయే రిప్లై ఇచ్చింది లావణ్య త్రిపాఠి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *