కేజీఎఫ్‌-2: ‘మెహబూబా’ ఫుల్‌ సాంగ్ రిలీజ్..!

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ నటించిన సినిమా కేజీయఫ్‌-2. యశ్‌కు జోడిగా శ్రీనిధి శెట్టి నటించింది. భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 14న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.  అంచనాలకు తగ్గట్టుగా భారీ రికార్డులు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా చిత్ర బృందం విడుదల చేస్తుంది. ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని తల్లి సెంటిమెంట్‌ సాంగ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసాంగ్‌ను రిలీజ్ చేశారు.

Mehabooba Full Song Out From KGF 2 Movie

ఈ సినిమాలోని మెహబూబా అంటూ సాగే లవ్‌ వీడియో సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ఈ వీడియో సాంగ్‌ లింక్‌ను షేర్‌ చేసింది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా అలరించింది. సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

మరోవైపు ఈ ఏడాది (2022)లో విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘కెజియఫ్ 2’ సరికొత్త చరిత్ర లిఖించింది. హిందీలో ఈ ఏడాది హయ్యస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్, ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్, ఫస్ట్ వీక్ రికార్డులు ఈ సినిమా పేరు మీద ఉన్నాయి. అంతే కాదు… రూ. 250 కోట్లు కలెక్షన్స్ మార్క్ చేరుకున్న సినిమాగా కూడా ‘కెజియఫ్ 2’ రికార్డ్ క్రియేట్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’కు హిందీలో రూ. 270 కోట్లు వసూళ్లు రాగా… ‘కెజియఫ్ 2’కు 412.8 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఇంకా ఈ సినిమా ప్రభంజనం కొనసాగుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *