నటి యమున ఇళ్లును చూసారా ఎంత బాగుందో అసలు!

Actress Yamuna: టాలీవుడ్ ప్రేక్షకులకు సినీనటి యమున గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 30 సినిమాలకు పైగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా టాక్సీవాలా సినిమాలో శిశిర తల్లిగా నటించి ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తుంది.

Actress Yamuna
Actress Yamuna

ఆపై అనేక సీరియల్ లో నటిస్తూ బుల్లి తెరపై మంచి స్టెబిలిటీ ఏర్పరుచుకుంది. ఈ భామ సోషల్ మీడియా లో కూడా బాగానే యాక్టీవ్ గా ఉంటుంది. ఆ మధ్య హోమ్ టూర్ పేరుతో యూట్యూబ్ లో తెగ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ వీడియోకి కొన్ని లక్షల వ్యూస్ పొందింది. ఆ వీడియో చూసి కనీసం నెలరోజులు అవుతుందో లేదో మరో హోమ్ టూర్ పేరుతో నెటిజన్ల ముందుకు వచ్చేసింది.

భవిష్యత్తులో రిటైర్మెంట్ తీసుకున్నాక ప్రశాంతంగా ఉండడానికి వీలుగా హైదరాబాద్ నగరానికి దూరంగా ఉన్న ఒక మంచి స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆ స్థలం 350 గజాలు. ఆ స్థలంలో తనకు నచ్చినట్టుగా ఇంటిని నిర్మించుకుంది. పూజ గది, హాల్, కిచెన్, డైనింగ్ హాల్, మూడు బెడ్ రూములు, ఒక ఆఫీస్ రూమ్ ఇలా అన్నిటినీ చూపించింది.

ముందు కాలంలో లిఫ్ట్ ఏర్పాటు చేయడానికి కొంత స్పేస్ ను కూడా వదులుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇల్లు సింపుల్ గా చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. విశాలమైన ప్రాంతంలో ఇల్లు కట్టడమే కాకుండా.. చాలా ప్రత్యేకంగా కట్టారని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *