అభిమానుల హృదయాలు దోచుకున్న రష్మిక.. వీడియో వైరల్..!

టాలీవుడ్‌తో పాటు ఇతర దక్షిణాది సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న నటి రష్మికా మందన్నా. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ గతేడాది విడుదలైన.. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ మూవీ ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది. అంతేకాకుండా ‘మిస్టర్ మజ్ను’, ‘యానిమల్’ వంటి బాలీవుడ్ సినిమాల్లో స్టార్ హీరోలతో నటిస్తూ అక్కడ సైతం తనముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. అయితే.. పుష్పతో వచ్చిన స్టార్‌డమ్‌తో ఎక్కడికి వెళ్లిన ఆమె చుట్టూ పలువురు అభిమానులు చేరుతూ సెల్ఫీలు అడగడం మామూలైపోయింది. తాజాగా రష్మికకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. ఓ ఫ్యాన్‌తో రష్మిక ప్రవర్తించిన తీరుతో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

Rashmika Mandanna humbly stops her security personnel from stopping a fan

తాజాగా ఓ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న రష్మిక  సెట్ నుంచి తన కారవాన్‌లోకి వెళ్తుండగా… అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. ఒకరితర్వాత మరొకరు ఆమెతో సెల్ఫీలు దిగుతున్నారు. ఈ ఫోటోలు అన్నీ ఏం చేసుకుంటారు అంటూ ఫోటోగ్రాఫర్లతో సరదాగా మాట్లాడింది. ఇంతలో ఓ అభిమాని వ‌చ్చి ఫొటో కావాల‌ని అడిగాడు. అయితే ప‌క్క‌నే ఉన్న సెక్యూరిటీ గార్డు అత‌న్ని వెనక్కి పంపించేయ‌బోయాడు. కానీ ర‌ష్మిక అత‌న్ని వారిస్తూ ఎంతో ఓపిగ్గా త‌న అభిమానితో క‌ల‌సి ఫొటో దిగింది. కాగా ఆ స‌మ‌యంలో తీసిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

ఈ క్ర‌మంలోనే ర‌ష్మిక మంద‌న్న త‌న ఫ్యాన్స్‌పై చూపిస్తున్న ఆప్యాయ‌త‌కు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  ‘చాలా స్వీట్’, ‘దక్షిణాది నటులు చాలా ఒద్దికగా ఉంటారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *