సురేఖా వాణి రెండో పెళ్లి..? కూతురు సుప్రీత క్లారిటీ..!

టాలీవుడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్‌ మీడియాలో చాలా ఫాలోయింగ్‌ ఉంది. సురేఖ వాణి ఒకపక్క సినిమాలలో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో తన కూతురితో కలిసి రచ్చ చేస్తుంది. తన కూతురితో కలిసి రీల్స్ చేస్తూ ఆ రీల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే తన కూతురితో కలిసి హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తుంది సురేఖ వాణి.

Surekha vani daughter supreetha talk about her mother's second marriage

సింగర్ సునీత పెళ్లి తరువాత చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు పెళ్లి వార్తల్లో నిలిచారు. వారిలో సురేఖావాణి ఒకరు. మూడేళ్ల క్రితం భర్త చనిపోవడంతో సురేఖా వాణి కూతురు సుప్రితతో కలిసి ఉంటుంది. రెండో పెళ్లి వార్తలపై ఇన్నాళ్లు తల్లీకూతుళ్లిద్దరూ కొట్టిపారేస్తూ వస్తున్నారు. తాజాగా తన తల్లి రెండో పెళ్లి విషయంపై సుప్రిత ఓపెన్‌ అప్‌ అయింది. ”రెండో పెళ్లి అనేది పూర్తిగా అమ్మ తీసుకునే నిర్ణయం. నాకైతే కచ్చితంగా అమ్మకి రెండో పెళ్లి చేయలనే ఉంది. కానీ ఏం జరుగుతుందో టైం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే పూర్తిగా సెటిల్‌ అవుతున్నాం. అమ్మ తన కెరీర్ కంటే నా కెరీర్ మీదే ఎక్కువ ఫోకస్‌ పెడుతుంది” అని తెలిపింది. ఈ లెక్కన చూస్తే సురేఖ వాణి కూడా త్వరలో రెండో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది.

Surekha vani daughter supreetha talk about her mother's second marriage

ఇక తన కూతురిని కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకుంటుంది సురేఖ. ఇటీవలే సుప్రీత ఒక ప్రైవేట్ ఆల్బమ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ వీడియో ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లి రెండో పెళ్లి గురించి కూడా చెప్పింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *