పవన్‌ కల్యాణ్ అంటే తనకు ఎందుకు ఇష్టమో చెప్పిన సాయి పల్లవి!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి సాయిపల్లవి. ఆమె నటించిన తాజా చిత్రం విరాటపర్వం..  జూన్ 17వ తేదీ విడుదల కాబోతుంది. దీంతో చిత్రబృందం అంతా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడిపేస్తుంది. అటు హీరో, హీరోయిన్‌లు రానా, సాయి పల్లవి సైతం వరుస ఇంటర్వూల్లో పాల్గొంటూ అనేక విశేషాలను పంచుకుంటున్నారు. అనేక కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే విరాటపర్వం డైరెక్టర్స్ వేణు, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, హీరో నవీన్ చంద్ర, సాయిపల్లవి..  సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి విచ్చేశారు.

sai pallavi intresting comments about pavan kalyan goes viral

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఆయన్ను ఇష్టపడుతుంటారు. రీసెంట్‌గా అనుపమ పరమేశ్వరన్.. పవన్ కళ్యాణ్ పై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టింది. ఆయన మీద ఉన్న అభిమానంతో బురఖా వేసుకొని మరీ ‘భీమ్లానాయక్’ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్లు చెప్పింది. ఇక రీసెంట్ గా సాయిపల్లవి.. పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. క్యాష్‌ షోలో ఆమె పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది.

‘పవన్ కళ్యాణ్ మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడరు. ఆయన మనసు ఏమనిపిస్తుందో అదే మాట్లాడతారు.ఆయన ఒక సూపర్ స్టార్ హీరో అనే గర్వం కూడా ఉండదు అందుకే పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అని ఈ సందర్భంగా సాయి పల్లవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా సాయి పల్లవి పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పవన్ అభిమానులు సైతం ఎంతో ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

https://twitter.com/SupremePSPK/status/1536574813686628353?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1536574813686628353%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fwhy-is-sai-pallavi-a-huge-fan-of-powerstar-pawan-kalyan-37623

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *