ఆయనను చూస్తూ కట్ చెప్పడం కూడా మర్చిపోతా.. చిరు గురించి ఓపెన్ కామెంట్స్ చేసిన మోహన్ రాజా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గా గుర్తింపు పొంది ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న చిరు ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. యంగ్ హీరోలతో సైతం పోటీగా దూసుకెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమాలో నటించగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా తర్వాత డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. హిట్లర్ సినిమా సమయంలో తనకు 22 ఏళ్ల వయసని, గ్యాంగ్ లీడర్ సినిమా సమయం నుండి చిరంజీవికి పెద్ద అభిమానినని తెలిపాడు.

హిట్లర్ సినిమా కు ఓ నిర్మాత కొడుకు గా చిరంజీవి దగ్గర పని చేశానని తెలిపాడు. హిట్లర్ ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో చూస్తున్నప్పుడు చిరంజీవి పక్కనే ఉన్నానని.. ఆయనకు అర్థంకాని సన్నివేశాలు వచ్చినప్పుడు తెలుగులో అనువదించానని తెలిపాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయనతో పని చేసే అవకాశం వచ్చిందని అన్నాడు.

చిరంజీవితో షూటింగ్ చేస్తున్నప్పుడు తను కట్ చెప్పడం కూడా మర్చిపోయి అలాగే చూస్తూనే ఉంటానని తెలిపాడు. 45 రోజులు షూటింగ్ పూర్తయిందని.. జనవరి కి చాలా వరకు పూర్తవుతుందని తెలిపాడు. ఈ సినిమాలో రెండు ఫైట్లు బాగా వచ్చాయని ఇక చిరంజీవి పాత్ర కూల్ గా ఉంటుందని అందర్నీ గ్రిప్ లో పెట్టుకునే లీడర్ గా కనిపిస్తారని తెలిపాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *