‘హరిహర వీరమల్లు’ గురించి క్రేజీ అప్‌డేట్‌ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గా ఈ సినిమా కోసం పవన్ కత్తిసాము ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోను షేర్ చేయగా.. అది బాగా వైరల్ అయింది. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, మిగతా 50 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకోవలసి ఉంది.

Nora Fatehi Replaces Jacqueline Fernandez in Pawan Kalyan's Hari Hara Veera Mallu

పవన్‌ సరసన తొలి కథానాయికగా నిధి అగర్వాల్ ఎంపికవగా మరో కీలక పాత్రలో నర్గిస్‌ ఫక్రి కనిపించనుంది. వీరితోపాటు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఈ సినిమాలో సందడి చేస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆమె స్థానాన్ని నోరా ఫతేహి భర్తీ చేయబోతుందంటూ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అతి త్వరలోనే ఆమె చిత్రీకరణలో పాల్గొనే అవకాశాలున్నాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కెనడా అందం నోరా ఫతేహి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘టెంపర్‌’లోని ‘ఇట్టాగే రెచ్చిపోదాం’, ‘బాహుబలి’లోని ‘మనోహరి’, ‘ఊపిరి’లోని ‘డోరు నంబరు’ తదితర ప్రత్యేక గీతాల్లో నర్తించి, అలరించింది.

Nora Fatehi Replaces Jacqueline Fernandez in Pawan Kalyan's Hari Hara Veera Mallu

17వ శతాబ్దం నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశంతో ‘హరి హర వీరమల్లు’ రూపొందుతోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ ‘దసరా’కి .. లేదంటే ‘సంక్రాంతి’కి రిలీజ్ చేయాలనే ఒక నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *