ఆకట్టుకున్న‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్రైలర్… మీరు చూశారా?

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా మార్చ్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఖుష్బూ, రాధికా, ఊర్వశి లాంటి సీనియర్ నటులు నటించారు. చాలా మంది లేడీ ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. పెళ్ళికి సంబంధించిన కాన్సెప్ట్ తీసుకొని ఫుల్ కామెడీతో, ఆడవాళ్ళ గొప్పతనం గురించి చెప్తూ ఈ సినిమా ఉండబోతుందని గతంలోనే డైరెక్టర్ తెలిపారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.

కామెడీ, ఎమోషన్, లవ్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేస్తూ ఆడియన్స్‌లో అంచనాలు పెంచే విధంగా ఈ ట్రైలర్‌ను రూపొందించారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. శర్వానంద్‌కి గత కొన్ని రోజులుగా హిట్ సినిమా లేకపోవడంతో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీనే విడుదల కావాల్సి ఉండగా… పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ కారణంగా మార్చి 4వ తేదీకి వాయిదా పడింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను సోనీ లివ్ దక్కించుకుంది.

https://twitter.com/DirKishoreOffl/status/1497928434844119047?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1497928434844119047%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fsharwanand-rashmika-mandanna-starrer-aadavallu-meeku-joharlu-trailer-launched-online-24070

నిజానికి ఈ సినిమా 2016లోనే వెంకటేష్, నిత్య మీనన్‌లతో ప్రారంభం అయింది. అయితే కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత శర్వానంద్, రష్మిక మందన్నలతో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ తర్వాత ఈ స్క్రిప్టుకు ఎన్నో మార్పులు చేసినట్లు కిషోర్ తెలిపారు. శర్వానంద్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. ఎందుకంటే 2017లో వచ్చిన మహానుభావుడు తర్వాత శర్వానంద్ ఇప్పటివరకు హిట్టు ముఖం చూడలేదు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *