మెగాస్టార్ చిరంజీవి కి కరోనా.. పలువురు స్టార్ హీరోలు పరామర్శలు!

Chiranjeevi: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. 150 సినిమాలకు పైగా నటించి తన బ్రేక్ డాన్స్ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఈ అగ్ర కథానాయకుడు రాజకీయంగా కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డాడు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలిసింది. ఈ విషయాన్ని చిరూ.. తన ట్విటర్ ఖాతా వేదికగా వెల్లడించారు. కొద్ది లక్షణాలు మాత్రమే ఉన్నాయని తాను ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్నట్లు తెలియజేశాడు. ఇక చిరంజీవికి కరోనా సోకడంతో బోలా శంకర్ మూవీ షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది.

ఇక చిరూ కి కరోనా సోకిన విషయం ట్విట్టర్ వేదికగా తెలవడంతో త్వరగా కోలుకోవాలంటూ.. ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని పలు స్టార్ హీరోలు ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. ఇక కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండగా దానికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని ఇన్వైట్ చేశారు. కానీ చిరంజీవికి కరోనా సోకడంతో ఆ స్థానంలో రామ్ చరణ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదల కావాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *