మదర్స్‌ డే వేళ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేసిన మెగాస్టార్‌ చిరు

మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా అంద‌రూ త‌మ త‌మ త‌ల్లుల ప్రేమ‌ను, సేవ‌ల‌ను గుర్తు చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ…అమ్మ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి త‌న త‌న తల్లి అంజ‌నా దేవికి సంబంధించి  స్పెష‌ల్ వీడియోను ట్విట‌ర్ ద్వారా పంచుకున్నాడు. ఓ సినిమా షూటింగ్స్ సెట్స్‌లో ఏర్పాటు చేసిన మ‌ధ్యాహ్న భోజ‌నానికి చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్, నాగ‌బాబు త‌మ‌ త‌ల్లి అంజ‌నాదేవిని ఆహ్వానించారు.

Mega star Chiranjeevi shares an emotional video on Mother’s day

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న ‘గాడ్‌ఫాదర్‌’, పవన్‌ హీరోగా నటించిన ‘భీమ్లానాయక్‌’ల చిత్రీకరణ గతంలో ఓసారి హైదరాబాద్‌లోని ఒకే ప్రాంతంలో జరిగింది. ఎప్పుడూ బిజీగా ఉండే చిరు-పవన్‌ ఇద్దరూ ఒకే చోట ఉండటంతో అంజనాదేవి, నాగబాబు లొకేషన్‌కి చేరుకుని, సెట్‌లో కాసేపు సమయాన్ని గడిపారు. అందరూ కలిసి సెట్‌లోనే భోజనం చేశారు. త‌న త‌ల్లికి చిరంజీవి గొడుగుప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా త‌మ త‌ల్లితో ముగ్గురు అన్న‌ద‌మ్ములు ఫొటోలు దిగారు. ఈ వీడియోని షేర్‌ చేస్తూ.. ‘అమ్మలందరికీ అభివందనములు’ అని చిరంజీవి కామెంట్‌ చేశారు. ముగ్గురు మెగా బ్రదర్స్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.ఇక సెలబ్రిటీలందరూ హ్యాపీ మదర్స్‌ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. చిరంజీవి ఈ వీడియోని పోస్టు చేసిన 3 గంటల్లోనే 2 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’, ‘వాల్తేర్ వీరయ్య’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *