బాలకృష్ణను కలవాలనుకుంటున్నారా అయితే ఇలా చేయండి?

Balakrishna: టాలీవుడ్ ప్రేక్షకులకు సీనియర్ నటుడు బాలకృష్ణ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బాలనటుడుగా తెలుగు తెరకు పరిచయమైనా బాలయ్య.. ఆపై ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటనలో తండ్రికి తగ్గ తనయుడు గా పేరు తెచ్చుకుని టాలీవుడ్ అగ్ర స్టార్ హీరోలలో తాను ఒక్కడుగా ఓ వెలుగుతున్నాడు.

Balakrishna
Balakrishna

ఇక ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన ‘అఖండ’ సినిమా ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య తన ప్రత్యేక యాటిట్యూడ్ తో థియేటర్లలో మొన్నటివరకు తెగ హడావుడి చేశాడు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఒటీటీ సంస్థ అత్యధిక ధరకు సొంతం చేసుకుంది.

జనవరి 21న ఆరు గంటల నుంచి హాట్ స్టార్ లో మూవీ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఒటీటీ సంస్థ నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలియజేసింది. ఈ ప్రకటనను కొన్ని గంటల క్రితమే ప్రకటించింది. బాలయ్యను కలవాలనుకున్న వారు.. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి 23వ తేదీ అర్ధరాత్రి వరకు అఖండ మూవీ ని హాట్ స్టార్ లో చూసి తర్వాత మూవీ గురించి ట్విట్టర్లో ‘అఖండరోర్ఆన్ హాట్ స్టార్’ అనే హ్యాష్ టాగ్ తో ట్విట్టర్లో ట్వీట్ చేయాలి. అలా చేసిన వాళ్లలో 500 మందిని లక్కీడ్రా ద్వారా కలెక్ట్ చేసుకుని ఒకరోజు వాళ్లందర్నీ బాలయ్య దగ్గరకు తీసుకుని వెళతాం అని ప్రకటన చేసింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *