‘బిగ్ బాస్’ నుంచి హోస్ట్‌ ఔట్‌.. కారణమిదే..!

బుల్లితెరపై ‘బిగ్‌బాస్‌’ సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కాదు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం అని తేడా లేకుండా.. అన్ని భాషల్లోనూ ఈ కార్యక్రమం దుమ్మురేపుతుంది. మలయాళంలో అందరికంటే ముందు మొదలై రచ్చ చేస్తుంది. ఇదిలా ఉంటే తెలుగులో ఈ షోకు హోస్టులు మారారు కానీ తమిళనాట మాత్రం ముందు నుంచి ఒక్కరే ఉన్నారు. ఆయనే కమల్ హాసన్. తొలి సీజన్ నుంచి మొన్న పూర్తైన ఐదో సీజన్ వరకు ఆయనే హోస్ట్ చేశారు. అన్ని సీజన్స్‌కు బాగానే రెస్పాన్స్ వచ్చింది కూడా.

అయితే ఈ తమిళ బిగ్‌బాస్‌కు కమల్ హాసన్ షాకిచ్చారు. తమిళ బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ అయిన ‘బిగ్ బాస్ అల్టిమేట్’ నుంచి తప్పుకుంటున్నట్లు స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘విక్రమ్’​ సినిమా, బిగ్​బాస్​ షో డేట్స్​ క్లాష్​ అవ్వడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమల్ వెల్లడించారు. బిగ్​బాస్​ యాజమాన్యంతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆరో సీజన్ కు తిరిగి వస్తానని ఆయన హామీ ఇచ్చారు. ‘బిగ్ బాస్ అల్టిమేట్’ 24 గంటల పాటు హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

kamal haasan quits as host for bigg boss ultimateఇక ‘విక్రమ్’ సినిమా మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతోన్న విక్రమ్ సినిమా గ్లింప్స్, ఫస్ట్ లుక్ నెట్టింట్లో ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనూ మంచి డిమాండ్ ఏర్పడింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *