విజయ్‌ దేవరకొండ సినిమాకి నో చెప్పా: పూనమ్‌ కౌర్‌

సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయిన నటి పూనమ్‌ కౌర్‌. చాలా కాలం గ్యాప్‌ తర్వాత ‘నాతిచరామి’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10న పలు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ‘నాతిచరామి’ ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది పూనమ్. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్‌ ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకునే సమయంలో ఈ కథ తన వద్దకు వచ్చిందని, కథ నచ్చడంతో ఓకే చేసేశానని ఆమె అన్నారు. ఇక హీరో విజయ్ దేవరకొండ గురించి.. తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Poonam kaur intresting comments on vijay devarakonda

‘చిన్నప్పటి నుంచి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఇంట్లోవాళ్లకు ఇష్టం లేకపోవడంతో చేయలేదు. కెరీర్ ఆరంభంలో విజయ్ దేవరకొండ సినిమాలోనూ ఛాన్స్ వచ్చింది. కానీ ఒప్పుకోలేదు. ఎందుకంటే సినిమాల్లోకి రావాలని.. నటననే కెరీర్ గా మార్చుకోవాలని అనుకోలేదు. అనుహ్యంగా సినిమాల్లోకి వచ్చాను. కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాను.. అయితే సినిమాలకు దూరంగా ఉండాలనుకున్న సమయంలో మా ఫ్రెండ్స్ వచ్చి నాతి చరామి గురించి చెప్పారు. నేను ఒప్పుకోలేదు. దీంతో వాళ్లు ముందు కథ వినమని చెప్పారు. ఆ తర్వాత నాకు స్టోరీ నచ్చి ఓకే అనేశాను.. అంటూ చెప్పుకొచ్చింది.

Poonam kaur intresting comments on vijay devarakonda

అనంతరం పలువురు టాలీవుడ్‌ హీరోలపై తన అభిప్రాయాన్ని చెప్పమని విలేకరి కోరగా.. ‘‘నాగార్జున.. చాలా అందంగా, ఎప్పుడూ ఉత్సాహంగానే కనిపిస్తారు. ఆయన కుటుంబమంటే నాకెంతో గౌరవం. ఇక, చిరంజీవి అంటే మా కుటుంబం మొత్తానికి ఎంతో ఇష్టం. నా చిన్నప్పుడు, మా నాన్న ఎక్కువగా చిరు సినిమాలకు తీసుకువెళ్లేవారు. రామ్‌చరణ్‌ గురించి ఎన్నో చెప్పాలని ఉంది. కానీ ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. అతను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని పూనమ్‌ చెప్పారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *