బాలీవుడ్‌ హీరోయిన్‌తో సందీప్‌ కిషన్‌ లవ్‌ట్రాక్‌?

ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోలు, హీరోయిన్ల లవ్ స్టోరీల ట్రెండ్‌ నడుస్తుంది. అవి నిజమో కాదో తెలియదు కానీ.. ఎప్పటికప్పుడు పలువురు నటీనటులపై రూమర్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఆ రూమర్స్‌పై కొందరు స్పందించగా.. మరికొందరు లైట్‌ తీసుకుంటున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లో టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ జాయిన్‌ అయ్యారు.

Romours on  Sundheep kishan like he is in love with bollywood acteress

సందీప్ కిషన్ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కాస్త స్పీడు తగ్గించారు. ఆయన నటిస్తోన్న సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో హిట్ కావడం లేదు. ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ కంటెంట్‌పై కూడా దృష్టి పెట్టారు. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో జోరు కొనసాగిస్తున్నారు సందీప్‌. ఆయన చివరిగా ‘గల్లీ రౌడీ’ అనే సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ‘మైఖేల్’లో నటిస్తున్నాడు. తమిళంలోనూ రెండు సినిమాల్లో నటిస్తున్నారు ఈ యంగ్ హీరో. ఇదిలా ఉండగా.. ఇప్పుడు సందీప్‌కి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Romours on  Sundheep kishan like he is in love with bollywood acteress

అదేంటంటే.. మన యంగ్‌ హీరో బాలీవుడ్ బ్యూటీని లైన్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఒక అమెరికా అమ్మాయితో సందీప్‌ సీరియస్ రిలేషన్షిప్‌లో ఉన్నాడని టాక్‌ వినిపిస్తోంది. ఆ అమ్మాయి మరెవరో కాదు బాలీవుడ్ నటి సోనియా రాథీ. సోనియా వెండితెరపై పెద్దగా కనిపించలేదు. ‘బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్’ అనే వెబ్ సిరీస్.. ఆమెను ప్రేక్షకులకు దగ్గర చేసింది. వీరిద్దరు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారట. వాస్తవానికి ఇద్దరూ కలిసి కొన్ని పబ్లిక్ ఈవెంట్‌లలో కూడా కనిపించారు. అయితే సందీప్, సోనియా మధ్య పరిచయం ప్రేమగా మారి వీరిద్దరు కలిసి ముంబాయిలో చక్కర్లు కూడా కొడుతున్నారంటూ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై అటు సందీప్ కానీ ఇటు సోనియా కానీ స్పందించలేదు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *