స్టార్‌ హీరోతో పెళ్లి వార్తలపై హీరోయిన్‌ క్లారిటీ..!

మీడియాలో తరచూ సెలబ్రిటీల మధ్యలో ఏదో నడుస్తుంది అన్న వార్తలు రావడం సహజమే. అయితే అవన్నీ పుకార్లే అని కూడా అర్థమవుతుంది. ఇక కొంత మంది సినీ తారలు సీక్రెట్ గా వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే తరహాలో సల్మాన్ ఖాన్ కూడా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

sonakshi sinha responds about her marriage with salman khan

సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారంటూ ఇటీవల నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వీరికి సబంధించిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, అందాలభామ సోనాక్షి సిన్హా ఆ ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. దీంతో వీరిద్దరికి పెళ్లి అయ్యిందనే పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్ ఎక్కువవటంతో.. సోనాక్షి సిన్హా దీనిపై స్పందించారు.  ‘‘ రియల్ ఫోటోకు మార్ఫింగ్ ఫోటోకు తేడా తెలియనంత మూర్ఖంగా తయారయ్యారా..? అంటూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నవారిపై మండిపడింది. దీంతో ఈ రూమర్స్‌కి చెక్‌ పడినట్టయింది.

sonakshi sinha responds about her marriage with salman khan

ఇక సల్మాన్‌ ఖాన్‌ విషయానికి వస్తే ఐదు పదుల వయసు దాటినా.. ఇప్పటికీ ఫిట్‌గానే ఉన్నాడు. అయితే ఇన్నేళ్లు వచ్చినా.. పెళ్లికి మాత్రం ఎస్ చెప్పడం లేదు సల్లూ బాయ్. గతంలో అనేక సార్లు పలువురు హీరోయిన్లతో లవ్ ఎఫైర్లు, డేటింగ్ లు జరిపాడు. అయినా ఈ లవ్ ట్రాక్‌లను పెళ్లిదాకా తీసుకుపోలేకపోయాడు ఈ దబాంగ్ హీరో. అందాల తార ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్ ఇలా చాలా మందితోనూ లవ్ ట్రాక్ నడిపినట్లు టాక్‌ ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *