ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారిన థియేటర్ల తనిఖీలు… ఎన్ని సీజ్ చేశారంటే

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లను తనిఖీలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కృష్ణాజిల్లా, విజయనగరం జిల్లాలతో పాటు రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తోన్న థియేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ మేరకు నేడు కృష్ణా జిల్లా విజయవాడలో జేసీ మాధవీలత ఆధ్వర్యంలో థియేటర్ల తనిఖీలు కొనసాగాయి. నగరంలోని గాంధీనగర్ లో జయరాం థియేటర్‌కు వచ్చిన ఆమె సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలోని ఫైర్‌ సేఫ్టీ సదుపాయాలను తనిఖీ చేశారు. కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ గురించి సిబ్బందిని ఆరా తీశారు.

ap state governament conducting rides on theatres

ఆ తర్వాత మీడియాతో మాట్లాడినా జేసీ మాధవీలత కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 15 థియేటర్లు సీజ్ చేశామన్నారు. లైసెన్సు లేకుండా నడుస్తున్న 15 థియేటర్లు మూసివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు జేసీ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్లలో తనిఖీలు చేస్తున్నాం. టికెట్‌ ధరలు, ఫైర్ సేఫ్టీ ,కోవిడ్ ప్రొటోకాల్స్‌ విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం అని వెల్లడించారు. కొన్ని థియేటర్లలో టికెట్‌ రేట్ల కంటే తినుబండారాల ధరలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే మల్టీఫ్లెక్స్‌లతో పాటు అన్ని థియేటర్లకు ఫిక్స్‌డ్‌ రేట్లు నిర్ణయించి బోర్డులు పెడతాం. జీవో 35ను కోర్టులో కొట్టేయడంతో అంతకు ముందు రేట్లు అమలుపై దృష్టి పెట్టాం. టికెట్‌ రేట్ల పెంపు కోసం మాకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి అని మాధవీలత పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో కూడా దాదాపు 6 సినిమా థియేటర్లు సీజ్ చేసినట్లు సమాచారం అందుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *