కేఎల్‌ రాహుల్‌తో ప్రేమ, పెళ్లిపై స్పందించిన అతియా శెట్టి

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ అతియా శెట్టి. కెరీర్‌ ఆరంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన విజయాన్ని ఆమె అందుకోలేకపోయింది. అయితే, భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌తో అతియ ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తరచూ వీళ్లిద్దరూ టూర్స్‌కి వెళ్లి వస్తుండటం ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఈ క్రమంలోనే ఈ ఏడాదిలో వీరు పెళ్లి చేసుకోనున్నారని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. బాలీవుడ్‌ జంట దీపిక-రణ్‌వీర్‌ల ఇంటికి సమీపంలోనే వీరిద్దరూ ఓ ఫ్లాట్‌ తీసుకున్నారని వివాహమైన వెంటనే ఆ ఇంట్లోకి మకాం మార్చనున్నారని చెప్పుకున్నారు.

Athiya shetty reacts on rumours of her wedding with kl rahul

ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్‌తో పెళ్లి వార్తలపై స్పందించింది హీరోయిన్‌ అతియా శెట్టి. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన అతియాకు రాహుల్‌తో డేటింగ్‌, పెళ్లి రూమర్స్‌పై ప్రశ్న ఎదురైంది. ఇది విని ఆమె ఒక్కసారిగా నవ్వింది. అనంతరం ‘దీనిపై నేను ఎలాంటి కామెంట్‌ చేయలేను. ఈ రూమర్స్‌ అన్నీ విని విసిగిపోయా. ఇక ఈ వార్తలకు నేను నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయలేను. ప్రజలకు ఎలా అనిపిస్తే అలా అనుకోవివ్వండి. వారికి నచ్చినట్టుగా వారు ఆలోచిస్తున్నారు’ అని బదులిచ్చింది. అలాగే రాహుల్‌తో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్‌ అవుతున్న వార్తలపై కూడా ఆమె స్పందించింది. ‘నేను కొత్త ఇంటికి మారుతున్న విషయం వాస్తవమే. కానీ ఎవరితోనో కాదు. నా కుటుంబంతోనే. త్వరలోనే మా అమ్మ-నాన్న(మన శెట్టి-సునీల్‌ శెట్టి)తో పాటు నా సోదరుడుతో కలిసి ముంబై బాద్రాలోని కొత్త ఇంటికి మారబోతున్నా’ అని చెప్పుకొచ్చింది.

Athiya shetty reacts on rumours of her wedding with kl rahul

కాగా గత మూడేళ్లుగా కెఎల్‌ రాహుల్‌, అతియాలు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే వారి రిలేషన్‌ను ఆఫిషియల్‌ చేశారు ఈ జంట. కెఎల్‌ రాహుల్‌ బర్త్‌డే సందర్భంగా ‘ఎక్కడైనా నీతోనే.. హ్యాపీ బర్త్‌డే’ అని అతియా పోస్ట్ షేర్‌ చేసింది. దీంతో త్వరలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *