పెళ్లి అనేది తన కెరీర్ పై ప్రభావం చూపలేదంటున్న మలైకా అరోరా!

Malaika Arora: బాలీవుడ్ భామ మలైకా ఆరోరా.. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక పాటలో అలరించిన బ్యూటీ అంటే తెలుగు ప్రేక్షకులు ఎవరైనా ఇట్టే గుర్తు పడతారు. తెలుగు ప్రేక్షకులతో అంత ర్యాపో లేని ఈ భామ.. బాలీవుడ్ లో ఇప్పుడు ఓ వెలుగు వెలుగుతుంది.

Malaika Arora
Malaika Arora

ఇక మలైకా ఆరోరా సల్మాన్ ఖాన్ సోదరుడు అయినటువంటి అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. కొంతకాలం వీరిద్దరు జీవనం బాగానే సాగగా.. 2017 లో వీరిద్దరు వివాహ బంధానికి బ్రేక్ అప్ చెప్పుకున్నారు. ఇదిలా ఉండగా ఆరోరా తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి.. వృత్తి పై ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది.

గ్లామరస్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఆ క్రమంలో ఎదురైన ఆపదలన్నీ ఎదుర్కొన్నానని చెప్పింది. “పెళ్లి అనేది నా కెరీర్ పై ప్రభావం చూపలేదు. పెళ్లి చేసుకొని పిల్లలు ఉన్నవారు ఇదివరకు కొంతమందే నటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పెళ్లి అయినా కూడా నటించే వారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. నేను నటనను ఎప్పుడు గ్లామర్ ఇండస్ట్రీగానే అనుకున్నాను.

గ్లామరస్ గా ఉండటానికి ప్రయత్నించి ఎన్నో అవకాశాలు సొంత చేసుకున్నాను ” అని మలైక ఆరోరా మీడియా ద్వారా తెలిపింది. ఇక మలైక, అర్భాజ్ లు వైవాహిక జీవితానికి బ్రేక్ అప్ చెప్పకముందు ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అతని పేరు అర్హాన్. ఇప్పుడు అర్హాన్ విదేశాల్లో చదువుకుంటున్నాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *