వామ్మో… రజనీకాంత్ సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. సాధారణ ఒక బస్ కండక్టర్ గా తన జీవితాన్ని గడుపుతున్న ఈయన నటన పై ఉన్న ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఏడు పదుల వయసులో కూడా రజనీకాంత్ ఏమాత్రం ఎనర్జీ కోల్పోకుండా అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా డిసెంబర్ 12వ తేదీ రజనీకాంత్ 71వ వసంతంలోకి అడుగుపెట్టారు.

ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం… సినిమా ఇండస్ట్రీలో అత్యంత పారితోషకం తీసుకున్న వారిలో రజనీకాంత్ ఒకరు. ఇలా రజనీకాంత్ ఎన్నో వందల చిత్రాల్లో నటించి ఆస్తులు కూడా బాగా పోగు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన నికర ఆస్తులకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కక్నా లెడ్జ్‌ 2021 నివేదిక ప్రకారం.. రజనీ నికర ఆస్తుల విలువ 360 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే రజనీకాంత్ ఈ మొత్తం డబ్బును కేవలం సినిమాల ద్వారా మాత్రమే సంపాదించారు.రజనీకాంత్ నటనపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీలోనే కొనసాగారు కానీ ఎప్పుడూ కూడా ఎలాంటి కమర్షియల్ యాడ్, ఇతర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడు, పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉండడం చేయలేదు. కేవలం సినిమాల ద్వారా మాత్రమే రజినీకాంత్ 360 కోట్ల ఆస్తులను సంపాదించారు.ఈ విషయం తెలిసిన పలువురు నెటిజన్లు కేవలం సినిమాల ద్వారా మాత్రమే ఎంత సంపాదిస్తే ఇక యాడ్స్ వంటి వాటిలో నటిస్తే ఇంకా ఎంత సంపాదించేవారో అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ఒక్కో సినిమాకు 60 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *