RRR నుంచి మరో సర్‌ప్రైజ్‌.. సెలబ్రేషన్స్‌ ఆరోజే అట..!

పాన్ ఇండియా మోస్ట్ అవైయిటెడ్ చిత్రం RRR. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా నేపధ్యంలో సినిమాను వాయిదా వేశారు మేకర్స్. ఇక మార్చి 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.

RRR celebration anthem will release on march 14th

మరోవైపు RRR రెండో విడత ప్రమోషన్స‌కు సర్వం సిద్ధం అయింది. ఈ క్రమంలో తాజాగా మరో స్పెషల్ సర్ ప్రైజ్ రివీల్ చేశారు రాజమౌళి. నిజానికి ఈ స్పెషల్ సర్‌ప్రైజ్‌ను సినిమా చివరలో ఇవ్వాలనుకున్నారట. కానీ ఎగ్జయిట్మెంట్ ఆపుకోలేక ఇప్పుడు రివీల్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు రాజమౌళి. ఇంతకీ ఆ స్పెషల్ సర్‌ప్రైజ్‌ ఏంటీ అనుకుంటున్నారా ? అదే ఆర్ఆర్ఆర్ సెలబ్రెషన్ యాంథమ్. ఎత్తర జెండా అంటూ సాగే ఈ ట్రిపుల్ ఆర్ సెలబ్రెషన్ యాంథమ్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ బాలీవుడ్‌ భామ ఆలియా భట్ ముగ్గురూ ఉండనున్నారు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ పోస్టర్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఈ పాట మార్చి 14న రిలీజ్ కానుంది.

https://twitter.com/ssrajamouli/status/1501890750686298117?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1501890750686298117%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fram-charan-and-ntr-movie-rrr-celebration-anthem-will-release-on-march-14th-657173.html

ఈ సినిమాకు మార్చి 24వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెయిడ్ ప్రీమియర్లు పడతాయని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ధరల పెంపుపై ఎటువంటి అనుమానాలూ లేకపోయినా… ఏపీలో ఏ పరిస్థితులు నెలకొంటాయో చూడాలి. అలాగే బాహుబలి ఫ్రాంచైజీ కలెక్షన్లను ఈ సినిమా దాటుతుందని కూడా ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆర్ఆర్ఆర్ సినిమాపై దేశవ్యాప్తంగా ట్రేడ్ వర్గాలు ఓ కన్నేశాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *