కండోమ్స్‌ వాడాలంటూ నిధి అగర్వాల్ ప్రచారం.. ట్రోలింగ్‌ రచ్చ..!

హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ మధ్య కాలంలో ఏది చేసిన వివాదానికి గురవుతున్నారు. ఇటీవలే ఓ లిక్కర్ బ్రాండ్‌కు ప్రచారం కల్పించి వివాదాస్పద వ్యాఖ్యలు ఎదుర్కొన్న ఈ భామ.. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి ఏకంగా కండోమ్స్‌కు ప్రచారం కల్పిస్తున్నారు. ఓ కంపెనీకి చెందిన కండోమ్స్ ఉపయోగించమని సలహా ఇచ్చారు. వాటిని వాడితే మంచి అనుభూతి కలుగుతుందని, లైంగిక సంతృప్తి కలుగుతుందని నిధి అగర్వాల్ ఓ కండోమ్స్ కంపెనీని ప్రమోట్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Nidhi agerwal promotes condom and trolled by netizens

నిధి పోస్టుల కింద కొంత మంది అసభ్యకరమైన రీతిలో, ఇక్కడ రాయలేని భాషలో పోస్టులు చేశారు. కండోమ్స్ మీరు ఉపయోగించారా? అని కొందరు ప్రశ్నించారు. అనుభవంతో చెబుతున్నారా? అని కొందరు వెటకారంగా అడిగారు. ఇటువంటి యాడ్స్ చేయవద్దని కొందరు సలహా ఇచ్చారు. మొత్తం మీద సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ కండోమ్స్ ప్రచారం దుమ్ము దుమారం రేపుతోంది.

https://www.instagram.com/p/CcNtWQFDpkX/?utm_source=ig_embed&ig_rid=e2a29e68-6e4d-49f0-b57d-566732539e95

https://www.instagram.com/p/CcNah-Zj5w6/?utm_source=ig_embed&ig_rid=22b58ba5-358e-4dd5-a364-0fc4785e614d

ఇలాంటి వివాదాస్పదమైన ప్రచారాలు చేయడం నిధికి కొత్తేమి కాదు.. లిక్కర్ బ్రాండును ప్రమోట్ చేసినప్పుడు కూడా వ్యతిరేక స్పందనలు వినిపించాయి.. కానీ ఇప్పుడు మాత్రం అంతకంటే ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. కురచ దుస్తులను ధరిస్తూ.. ఎక్కువగా ఆమె వస్త్రాధారణపై విమర్శలు వస్తుంటాయి. ఈ విషయంపై ఆమె గతంలో కాస్త ఘాటుగానే స్పందించింది. మరి ఈ సారి కండోమ్స్‌పై ప్రచారం నిర్వహించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సారి ఏ విధంగా రియాక్ట్ అవుతోందో వేచి చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *