ప్రభాస్ అభిమానులకు సర్‍ప్రైజ్ గిఫ్ట..!

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఈ సినిమాను వేసవిలో మార్చి 11న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఈ సినిమా నుంచి అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ను అందించింది చిత్ర బృందం. సూపర్‌హిట్‌ గీతం ‘ఈ రాతలే’ వీడియో ప్రోమోను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది.

ఫుల్‌ వీడియో శుక్రవారం మధ్యాహ్నం 12 గం.లకు విడుదలకానుంది. ఈ పాటలో ప్రభాస్‌, పూజాహెగ్డేల లుక్స్‌, లొకేషన్లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటకి జస్టిస్ శంకర్ మ్యూజిక్ అందించగా.. యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. విడుదలైన కాసేపట్లోనే ఈ పాట యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్‏తో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్‌’. సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తోంది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వింటేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ పాత్రను మహేష్ పరిచయం చేయడమే కాకుండా మధ్య మధ్య లోకూడా మహేష్ వాయిస్ వినిపిస్తుందట. అలాగే క్లైమాక్స్‌లో కూడా మహేష్ వాయిస్ ఉంటుందని అంటున్నారు. ఇక వచ్చేనెల మొదటివారంలో భారీస్థాయిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *