షూటింగ్‌లో గాయపడ్డ సమంత, విజయ్‌… క్లారిటీ ఇచ్చిన టీమ్..!

విజయ్‌ దేవరకొండ, సమంత కలిసి నటించిన చిత్రం ‘ఖుషి’. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కశ్మీర్‌ తొలి షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో పలు సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా హీరో విజయ్‌, సమంతకి గాయలయ్యాయని, ఆ వెంటనే వీరిద్దరినీ సమీప ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు టాక్‌ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై మూవీ పీఆర్‌ టీమ్‌ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పేసింది.

Vijay Deverakonda, Samantha injured on Kushi sets? Team clarifies

‘‘విజయ్‌, సామ్‌ గాయపడ్డారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కశ్మీర్‌లో 30 రోజుల పాటు విజయవంతంగా షూటింగ్‌ పూర్తి చేసుకుని చిత్ర బృందం హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది’’ అని ఖుషి టీమ్‌ తెలిపింది. రొమాంటిక్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్ జూన్‌లో ప్రారంభంకానుంది. ఈ చిత్రంలో విజ‌య్ ఆర్మీ అధికారిగా క‌నిపించ‌నున్న‌ట్లు టాక్‌. ‘ఖుషి’  సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ‘ఖుషి’ సినిమాను విడుదల చేయనున్నారు. మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, ‘వెన్నెల’ కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి

Add a Comment

Your email address will not be published. Required fields are marked *