బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. వరుస సినిమా అప్‌డేట్‌లతో అదరగొట్టిన సుధీర్‌బాబు

యంగ్‌ హీరో సుధీర్‌బాబు వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇటీవలె శ్రీదేవి సోడా సెంటర్‌ సినిమాతో హిట్‌ అందుకున్న సుధీర్‌బాబు కృతిశెట్టితో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు  హర్షవర్ధన్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్‌ చేశాడు. దానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ను బుధవారం (మే 11) సుధీర్‌ బాబు బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాకు ‘మామా మశ్చీంద్ర’ అన్న టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.

Sudheerbabu movie updates

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఒక రాక్ స్టార్‌లా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు నైట్రో స్టార్ సుధీర్ బాబు. ఈ సినిమాలో సుధీర్ బాబు ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్నారు. దర్శకుడు హర్షవర్ధన్ మునుపెన్నడూ చూడని మల్టీ షేడ్ క్యారెక్టర్‌లో సుధీర్ బాబుని చూపించబోతున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందించబడుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో కనిపిస్తుండగా, అత్యున్నత టెక్నికల్ టీం పని చేస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఏంటంటే… ‘మామా మశ్చీంద్ర’లో సుధీర్ బాబు సరసన ఈషా రెబ్బా, ‘గద్దలకొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ కామెడీగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఇందులో సుధీర్ బాబు డీజే రోల్ చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రెండు భాషల్లో ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేశారు. ‘మామా మశ్చీంద్ర’తో సుధీర్ బాబుకు నిట్రో స్టార్ అనే బిరుదు ఇచ్చారు.

https://twitter.com/isudheerbabu/status/1524261396287868928?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1524261396287868928%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fcinema%2Fsudheer-babu-s-15th-movie-titled-as-maama-mascheendra-sudheer-babu-maama-mascheendra-first-look-poster-launched-33049

తనకు ‘సమ్మోహనం’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు చేస్తున్న సినిమా  ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. అందులో దర్శకుడి పాత్ర చేస్తున్నారు. సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా  స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఇదే కాకుండా భవ్య క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో సుధీర్ తన 16వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఆకర్షణీయమైన పోస్టర్‌ను సుధీర్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరించింది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ పోస్టర్‌లో సుధీర్‌ బాబు తలికిందులుగా పుష్‌ అప్స్‌ చేస్తూ ఆకట్టుకున్నాడు. పోస్టర్‌ ద్వారా సూపర్ ఫిట్‌గా ఉన్న సుధీర్‌బాబుకు ‘హ్యాపీ బర్త్‌డే నైట్రో స్టార్‌’ అని విష్ చేశారు.

https://twitter.com/MythriOfficial/status/1524257814881120256?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1524257814881120256%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fcinema%2Fsudheer-babu-s-15th-movie-titled-as-maama-mascheendra-sudheer-babu-maama-mascheendra-first-look-poster-launched-33049

https://twitter.com/BhavyaCreations/status/1524327765243179009?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1524327765243179009%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fsudheer-babu-pre-look-poster-his-action-thriller-sudheer-16-1455450

Add a Comment

Your email address will not be published. Required fields are marked *