పెళ్లయ్యాక షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయన్‌తార..? ఇక నుంచి వాటికి నో..?

ఐదేళ్ళ ప్రేమ ప్రయాణం అనంతరం విగ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ నయనతార మళ్ళీ సినిమా ప్రపంచంలో కొనసాగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ మీడియాలో అయితే ఆమె సినిమాలు చేయకపోవచ్చని ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ అనంతరం నటనకు దూరం కావచ్చని కూడా టాక్ వచ్చింది. అయితే రీసెంట్ గా నయన్ భర్త ఇష్టప్రకారం తన కెరీర్ విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

Did Nayanthara put this new condition in her film agreement post-marriage?

నిమాల విషయంలో దర్శకనిర్మాతలకు ఆమె కొత్త కండీషన్స్‌ పెడుతున్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై తనని సంప్రదించబోయే దర్శకనిర్మాతలు గ్లామర్ రోల్స్‌ కోసం కాకుండా ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీస్‌తో తన దగ్గరికి రావాలన్నట్లు నయన్‌ కండీషన్‌ పెట్టిందట. మరి ఈ వార్త ఏ మాత్రం నిజమో తెలియాల్సి ఉంది. ఇక కెరీర్ ఆరంభంలో నయనతార ఎంత గ్లామర్‌గా నటించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందాలు ఆరబోస్తూ యువతని తనవైపు తిప్పుకుంది.

Did Nayanthara put this new condition in her film agreement post-marriage?

నిజానికి నయనతార ఇప్పటికే ఎక్స్‌ఫోజింగ్ చేసే పాత్రలకు దూరంగా ఉంటోంది. స్టార్‌ యాక్టర్స్‌తో నటించినా.. ఎక్స్‌ఫోజింగ్ విషయంలో ఏమాత్రం నిర్మోహమాటంగానే కుదరదు అంటోందని తెలుస్తోంది. తన పాత్రకు కొన్ని రూల్స్ పెట్టుకుందని, ఆ పరిధిలోనే సినిమాలు చేస్తుందని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల వివాహం చేసుకున్న ఈ లేడీ సూపర్‌స్టార్.. సినిమాలకు మాత్రం దూరంకానని చెప్పుకొచ్చింది. అయితే, తన పాత్ర విషయంలోనూ, గ్లామర్ ప్రదర్శించే విషయంలో మాత్రం కొత్త రూల్స్ పెట్టిందంట. ప్రస్తుతం నయన్‌ షారుఖ్ ఖాన్ తో జవాన్‌లో నటిస్తోంది. అలాగే గాడ్ ఫాదర్‌లో చిరుతో కలసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *