విశ్వక్‌సేన్‌కు మద్దతుగా నిలిచిన కుర్ర హీరోలు, డైరెక్టర్‌లు

ఇటీవల విశ్వక్ సేన్ తన సినిమా ప్రమోషన్స్ కోసం రోడ్డు మీద ఒక ప్రాంక్ చేయడం అది విమర్శల పాలవ్వటం తెలిసిందే. దీనిపై ఓ ఛానల్‌లో పెట్టిన డిబేట్‌లో పాల్గొన్న విశ్వక్‌ను యాంకర్ దేవి నాగవల్లి పాగల్ సేన్, డిప్రెస్డ్ పెర్సన్ అంటూ కామెంట్స్ చేసింది. దీనిపై రియాక్ట్ అయిన విశ్వక్ సేన్ తనను వ్యక్తిగతంగా ఎటాక్ చేస్తున్నందుకు పరువు నష్టం దావా వేయొచ్చని, కానీ అలా చేయనని ఎందుకంటే మీకు నాకు తేడా ఉండాలి కదా అని తన అభిప్రాయాన్ని చెప్పారు. దీంతో ఆగ్రహానికి లోనైన యాంకర్ తన స్టూడియో నుంచి విశ్వక్ సేన్‌ను ‘గెట్ అవుట్’ అంటూ గట్టిగా అరిచింది. దీంతో విశ్వక్.. యాంకర్ దేవిని ఉద్దేశిస్తూ F*** అనే పదాన్ని ఉపయోగించాడు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సదరు ఛానెల్, యాంకర్.. ఈ విషయంపై వరుస కథనాలు ప్రసారం చేస్తూ విశ్వక్ సేన్ ను ఆడుకున్నారు.

Tollywood celebrities supporting vishwak sen

ఈ విషయంలో అవమానం ఎదుర్కొన్న హీరో విశ్వక్ సేన్‌కి నెటిజన్ల నుంచే కాకుండా.. ఇండస్ట్రీ వైపు నుంచి కూడా మద్దతు పెరుగుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. కొన్ని సెటైరికల్ వీడియోలను షేర్ చేశారు. ఈ వీడియోతో తన సపోర్ట్ విశ్వక్ సేన్ కి అంటూ చెప్పకనే చెప్పారు. గతంలో అనసూయ కూడా ఇలాంటి పదాన్నే వాడినప్పుడు దేవి నాగవల్లి నవ్వేసి ఊరుకుంది. ఇప్పుడు విశ్వక్ సేన్ అంటే మాత్రం సీన్ చేసిందని ఒక వీడియోలో ఉంది. అలానే కొన్ని ట్రోలింగ్ వీడియోలను షేర్ చేస్తూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను క్యాప్షన్‌గా పెట్టారు.

వివాదాలలో ఇరుక్కొని సతమతమవుతున్న యంగ్ హీరోకు.. కుర్ర హీరోలు సైతం సపోర్ట్‌గా నిలవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విశ్వక్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంపై తమదైన రివ్యూ ఇచ్చి, ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చారు. ఈ హీరోల్లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఉండడం గమనార్హం. సిద్దు జొన్నలగడ్డ, సాయి ధరమ్ తేజ్, రాహుల్ రామకృష్ణ, డైరెక్టర్ సరోజ్ కుమార్, విశ్వక్ కు సపోర్ట్ చేస్తూ పోస్ట్లు పెడుతున్నారు. ఇక వీరి ట్వీట్ చూసి నెటిజన్లు ఒక హీరో కోసం ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు అంటే టాలీవుడ్ ఎంత గొప్పది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *