అనుపమకి కోపం తెప్పించిన ఫ్యాన్స్.. ఏం చేశారంటే..!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.ఇటీవలే రౌడీ బాయ్స్ సినిమాతో పలకరించింది. ప్రస్తుతం అనుపమ చేతిలో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు షాప్ ఓపెనింగ్స్ కి వెళ్తుంది. గతంలో చాలా షాప్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్ళింది అనుపమ. సెలబ్రిటీలు వచ్చినప్పుడు అక్కడి జనాలు చుట్టముట్టడం, సెల్ఫీల కోసం ఎగబడటం మాముము విషయమే. అయితే ఈ సారి అనుపమకి ఓ చేదు సంఘటన ఎదురైంది.

At Mall Inauguration, Fans Deflate Tires of Anupama Parameswaran's Car

ఇటీవల ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కు వెళ్లిన అనుపమకు ఫ్యాన్స్‌ షాకిచ్చారు. సోమవారం ఆమె సూర్యాపేట జిల్లా కోదాడలోని పీపీఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. దీంతో అనుపమను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించిన అనుపమ కాసేపు మీడియాతో ముచ్చటిచ్చింది. అనంతరం ఆమె తిరుగు ప్రయణమవుతుండగా సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్‌, స్థానికులు ఎగబడ్డారు.

At Mall Inauguration, Fans Deflate Tires of Anupama Parameswaran's Car

అయితే అప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. దీంతో అనుపమ మరికొద్దిసేపు ఇక్కడే ఉండాలని డిమాండ్‌ చేస్తూ కొందరు ఆకతాయిలు ఆమె కారు టైర్లలో గాలి తీశారట. దీంతో ఫ్యాన్స్‌ తీరుకు అనుపమ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో షాపు నిర్వాహకులు అనపమకు మరో కారు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు పంపించారట. కాగా తాజాగా ఆమె నటించిన ‘18 పేజెస్‌’ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆమె ‘కార్తికేయ 2’, ‘బటర్‌ ఫ్లై’ చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *