ఆధ్యాత్మిక బాట వైపు హీరోయిన్.. ఆందోళనలో దర్శకులు!

Sanchitha Shetty: సంచితా శెట్టి తమిళ వెండితెరకు సూదు కవ్వుం చిత్రం ద్వారా పరిచయమయ్యి తెలుగు, కన్నడ, తమిళం చిత్రాలలో నటించింది. ఈమె మొదట్లో సహాయక నటిగా నటించిన తరువాత వరుస సినిమాలతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్ దర్శకులలో ఆందోళన కలిగిస్తోంది.

ఎప్పుడు ఫోటోషూట్ చేయించుకున్న నాభి అందాలతో ఎక్స్ పోజ్ చేస్తూ కుర్ర కారుల మదిని దోచుకునేది. హఠాత్తుగా ఏమైందో ఏమో కానీ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది ఆమె. దాంతో ఎక్కువ సేపు ఆధ్యాత్మిక భావనా మార్గంలో మునిగిపోయి గ్లామర్, ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటోంది. ఇలా ఈమె ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడంతో దర్శకులు ఆందోళన చెందుతున్నారు.

ఆమె తాజాగా చేయించుకున్న ఫోటో షూట్ గ్లామర్ షోకు భిన్నంగా సాంప్రదాయబద్ధమైన చీరకట్టులో పద్ధతిగా కనిపిస్తూ ఫోటో షూట్ చేయించుకుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇకపై అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ ఇలానే నటిస్తానని స్పష్టం చేసింది. కానీ ఈమె కమిట్ అయిన చిత్రాల దర్శకులు ఏం చేయాలో తెలియక ఆమెపై విమర్శలు చేస్తున్నారు.

ఇలా ఈమె హఠాత్తుగా ఆధ్యాత్మికబాట వైపు అడుగులు వేయడానికి కారణం ఏంటా అని ఆందోళన చెందుతున్నారు. మరి ఈ బ్యూటీ సినిమారంగంలో ఇలాగే రాణిస్తుందో లేదో చూడాలి. త్వరలో సినిమాలకు కూడా స్వస్తి చెప్పే అవకాశం ఉందేమో..

Add a Comment

Your email address will not be published. Required fields are marked *