కన్నీటితో ఆ టీచరమ్మకు వీడ్కోలు.. నెట్టింట వీడియో వైరల్..!

ప్రతీ ఒక్కరి జీవితంలోనూ ముఖ్యమైన దశ బాల్యం. మన వందేళ్ల జీవితానికి ఇది పునాది వంటింది. ఇలాంటి వయసులో మనం జీవితాన్ని పాడవ్వాలన్నా.. లేక మంచిగా చేసుకోవాలన్నా కానీ ఇది కేవలం ఒక్క గురువుల వల్లే సాధ్యం అవుతుంది. ఇదే సమయంలో విద్య‌ను బోధించే గురువులకు , విద్యార్థుల‌కు మ‌ధ్య ఉన్న సంబంధం చాలా గొప్పగా ఉంటుంది. ఈ బాండింగ్ అనేది ఎంత గొప్పగా ఉంటే వారి మధ్య రిలేషన్ అనేది కూడా అంతే గొప్పగా ఉంటుంది. మారిన కాలం కొద్దీ కొంత మంది విద్యార్థులు టీచ‌ర్ల‌తో క‌లిసి మెలిసి ఉంటున్నారు. వారిని ఒక మంచి స్నేహితుని లెక్క భావిస్తున్నారు.

Students heart touching farewell in West Bengal
Students heart touching farewell in West Bengal

విద్యార్థులు ఉండే దానిని బట్టి టీచ‌ర్లు కూడా విద్యార్థుల‌తో స్నేహంగా ఉంటున్నారు. అలాంటి టీచ‌ర్ల‌కు ఏ పాఠశాలలో అయినా మంచి గుర్తింపు, గౌర‌వం ఎక్కువగానే ఉంటాయిన చెప్పాలి. అలాంటి టీచ‌ర్లు పదవీ విరమణ చేసే సమయంలో విద్యార్థులు వారికి చాలా గొప్పగా పార్టీ ఇస్తారు. ఇలాంటి ఘటనలు మనం చాలానే చూశాము. అయితే ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి బంగాల్​ లో జ‌రిగింది. ఆ రాష్ట్రంలోని 24 ప‌ర‌గ‌ణాల జిల్లాలో ఉన్న క‌టియాహ‌ట్ బీకేఏపీ బాలిక‌ల పాఠ‌శాల‌ ఆ ఘటనకు వేదిక అయ్యింది. సంపా అనే టీచ‌ర్ ఆ స్కూల్​లో విధులు నిర్వ‌హిస్తుండేవారు. అమె ఆ స్కూల్​ నుంచి మరొక స్కూల్​ కు వెళ్లేటప్పుడు అక్కడ విద్యార్థులు ఇచ్చిన వీడ్కోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

సంపా అనే ఈ స్కూల్​ టీచర్ బడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోతుంటే ఆమె విద్యార్థినులు ఆమెకు ఇచ్చిన వీడ్కోలు మాటల్లో చెప్పలేనిది. ఆమెకు ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఫెయిర్ వెల్ ను ఏర్పాటు చేశారు ఆ విద్యార్థులు. ముందుగా టీచ‌ర్ క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి స్కూల్​ మైదానం మధ్యలోకి తీసుకు వచ్చారు. అదే సమయంలో విద్యార్థినులు అందరూ మోకాళ్ల మీద నిలబడి.. బాలీవుడ్ సూప‌ర్ హిట్ సినిమా అయిన ర‌బ్‌ నే బ‌నాదీ జోడీ చిత్రంలోని ఓ పాటను ఆలపించారు. ఎదురుగా ఆమెకు ఫ్లవర్లు ఇచ్చారు. ఇదీ చూసిని ఆ టీచర్ కన్నీళ్లు ఆపుకోలేక పోయింది. ఒక వైపు టీచ‌ర్ క‌న్నీటి ప‌ర్యంతం అవుతుంటే మరోవైపు ఈ విద్యార్థినిలు కూడా అలానే ఏడవడం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *