రైలు వస్తుంటే ఆమెను నెట్టేసాడు.. అంతలో ఏం జరిగిందంటే!

Viral Train: సాధారణంగా సినిమాలలో రైలు సంఘటన ప్రమాదాలు చూస్తూనే ఉంటాం.. కరెక్ట్ గా వాళ్ళని రైలు ఢీకొననే సమయానికి ఏదో విధంగా ప్రాణాలతో బయట పడుతారు. మరి అదే తరుణంలో బెల్జియం మెట్రో స్టేషన్ లో అద్భుతమైన ఘటన జరిగింది. అసలు ఏమి జరిగిందంటే.. సాధారణంగా మెట్రో స్టేషన్ దగ్గర మెట్రో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.

అదే తరుణం లో ఇక్కడ కూడా ఓ యాభై ఐదు ఏళ్ల ముసలావిడ ప్లాట్ ఫామ్ పై రైలు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ఆమెను ఎవరో వెనక నుంచి నెట్టి పారిపోయారు. ఇక దాంతో ఆమె గాలిలో ఎగురుతూ పట్టాలపై పడిపోయింది. పాపం ముసలావిడ కదా లేవ లేక పోయింది. ఇంతలో అటువైపుగా ట్రైన్ రానే వచ్చింది.

అక్కడి చుట్టుపక్కల వారి అందరిలోనూ టెన్షన్ పెరిగిపోయింది. అప్పుడే సినిమాలో జరిగినట్టు.. ముసలావిడకు కొన్ని మీటర్ల దూరంలో ట్రైన్ సడన్ గా ఆగిపోయింది. సినిమాలో అచ్చం ఎలా చూపిస్తారో.. ఇక్కడ అలానే జరిగింది. ఇక ఆ క్షణం వరకు అక్కడ తోటి ప్రయాణీకులకు గుండె ఆగినంత పని అయింది. ట్రైన్ అలా ఆగగానే వారంతా ఊపిరిపీల్చుకున్నారు.

రోజియర్స్ మెట్రో స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి సీసీటీవీ ద్వారా ఈ వీడియో సేకరించ బడింది. ఇక ఆవిడను తోసేసిన దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ లో తెగ వైరల్ అవుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *