పెళ్లిలో అగ్ని ప్రమాదం.. ప్రాణాలతో బయటపడిన వరుడు..?

సాధారణంగా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు వచ్చే పడుతుంటాయి. అయితే మన అదృష్టం బాగుంటే ఆ ప్రమాదాల నుంచి ఎలాంటి ప్రాణ హాని జరగకుండా బయట పడతాము. ఇలాంటి ప్రమాదం నుంచి వరుడు అదృష్టంతో బయటపడ్డారు. గుజరాత్ లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా వరుడిని గుర్రం రథంపై ఊరేగిస్తూ ఎంతో సంతోషంగా బాణాసంచాలు కాస్తూ అతనిని పెళ్లి వేదిక వైపు తీసుకెళ్తున్నారు.ఇక ఈ గుర్రపు రథంలో వరుడుతో పాటు మరి కొందరు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఈ ఊరేగింపులో అనుకోని ప్రమాదం జరిగింది.

ఇలా బాణాసంచాలు కాలుస్తూ ఉన్న నేపథ్యంలో ఒక తారాజువ్వ గాలిలోకి ఎగిరి పొరపాటున రథంలో ఉన్న జనరేటర్ పై పడింది. ఇది గమనించిన వరుడు వెంటనే హుటాహుటిన రథం నుంచి దిగి అందులో ఉన్న పిల్లలను కిందికి దింపాడు. ఈలోగా గతంలో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.ఇక వెంటనే అందరూ అప్రమత్తమై రథానికి గుర్రాలను కూడా వినిపించడంతో ఎలాంటి ప్రమాదం ప్రాణనష్టం జరగకుండా అందరూ బయటపడ్డారు.

ఈ తోపులాటలో ఒక వ్యక్తికి మాత్రం గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వరుడు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆ వరుడు ఎంతో చాకచక్యంగా సమయస్ఫూర్తితో ప్రవర్తించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని లేకపోతే ఎంతో ప్రాణ నష్టం జరిగేదని వెల్లడిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *