తమ పెళ్లి కోసం జేసీబీ ఎక్కిన వధూవరులు.. వైరల్ వీడియో!

Viral video: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో.. పెళ్లి చేసుకునే సమయంలో వధూవరులు బాగా వైరల్ అవుతున్నారు. వధూవరులకు సంబంధించిన ఏదైనా ఫన్నీ మూమెంట్ ఉంటే వెంటనే వాటిని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. మరి ఇదే క్రమంలో సిమ్లాలో ఓ పెళ్లిజంట జెసిబి ఎక్కి హడావిడి చేసింది.

హిమాచల్ ప్రదేశ్ సిమ్లా కి ఈ సమయంలో వెళ్ళిన వారు ఎవరైనా సరే దాన్ని వేరే ట్రిప్ లా ఫీల్ అవుతారు. ఆకాశం భూమి కనిపించదు. అక్కడ ఉన్న చెట్లు, వాహనాలు వస్తువులన్నీ మంచుతో కప్పబడి ఉంటాయి. వర్షంలా మంచు 24 గంటలు కురుస్తూనే ఉంటుంది. ఎప్పుడు చలితో ఉంటుంది. అక్కడి స్థానికులు దీనిని అంతగా ఇష్టపడరు. ఎందుకంటే దీన్ని ప్రతి ఏడాది చూస్తుంటారు.

కానీ పర్యాటకులు మాత్రం దీనికి బాగా ఫిదా అవుతారు. ఈ కాలంలో అక్కడికి వెళ్లే టూరిస్టులు బాగా చిల్ అవుతూ ఉంటారు. అదే ఈ క్రమంలో సిమ్లా లో పెళ్లి చేసుకుంటున్న ఓ వధూవరులు.. మంచు విపరీతంగా కురవడంతో.. వాహనాలు నడపడం కుదరదు కాబట్టి.. మండపానికి వెళ్లడానికి ఒక జేసీబీ ఎక్కి వెళ్లారు.

దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ” హిమాచల్ ప్రదేశ్ లో బాగా మంచు కురుస్తుంది. అందువల్ల మంచుతో కూడిన సిమ్లా జిల్లాలో పెళ్లి మండలానికి వెళ్లడానికి వధూవరులు జేసీబీ లో ప్రయాణం చేస్తున్నారు” అని ఈ వీడియో కింద కాప్షన్ ఇచ్చారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *