కెమెరా ఎత్తుకుపోయిన ఒక చిలుక..వీడియో వైరల్?

Parrot:-ప్రస్తుత కాలంలో చాలా మంది కెమెరా కొనుగోలు పై ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇక సోషల్ మీడియా ప్రభావం వల్ల అందమైన వీడియోలో రికార్డు చేయడానికి కెమెరాను మరింత ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే వీడియో క్వాలిటీ, ఫోర్ కె రావడం కోసం కొత్తగా గోప్రో కెమెరాలను కొనుగోలు చేస్తున్నారు.

Parrot
Parrot

మరి ఆ కెమెరాతో షూట్ చేస్తున్న క్రమంలో ఒక చిలుక వచ్చి ఆ కెమెరాను ఎందుకు పోయిందట. అసలు ఏం జరిగింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. న్యూజిలాండ్ ఉన్న సౌత్ ఐలాండ్ లో ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ లో ఉన్న భవనం పైకి ఒక ఫ్యామిలీకి ఎక్కి గో ప్రో ను ఆన్ చేసి వీడియోస్ షూట్ చేస్తుంది.

ఇంతలో పక్కనున్న డాబాపై రెండు చిలుకలు ఉన్నాయి. ఆ ఫ్యామిలీ వాటి దగ్గర్లోనే ఆ గో ప్రో కెమెరా ని ఆన్ చేసి పెట్టారు. దాన్ని చూసి చిలుక అది తినే పండు అనుకొని ఆ కెమెరా నోట్లోకి కరుచుకొని వెళ్లి పోయింది. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు ఎంత మొరపెట్టిన ఆగ కుండా వెళ్ళిపోయింది. ఇక ఇదంతా ఒక కెమెరాల్లో రికార్డ్ అయింది.

అలా ఒక కిలోమీటరు వరకు వెళ్లిన తర్వాత ఆ చిలుక ఒక చోట ఆగి పోయి ఆ కెమెరాని తినేందుకు ప్రయత్నిస్తుంది. ఇక కెమెరా కోసం వెనుకబడిన కుటుంబ సభ్యులుకు చిలుక కనిపించింది. వాళ్లను చూసిన ఆ చిలుక ఆ కెమెరాను అక్కడ వదిలి ఎగిరిపోయింది. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు కెమెరాను తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *