రివర్స్​ గేర్​ వేశాడు… మురికి కాలువలో పడ్డాడు.!

మనం ఎంత అలెర్ట్ గా ఉన్న సరే జరిగే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వాటిని మనం ఇప్పటికే చాలా చూశాము. కొన్ని విషాదాన్ని మిగిల్చితే.. మరి కొన్ని చూడడానికి చాలా తమాషాగా ఉంటాయి. ఇలాంటి వాటిని నెటిజన్లు ఎప్పటికప్పుడు విరివిగా షేర్ చేస్తుంటారు. ఇలాంటి ఓ ప్రమాదం ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లకు నవ్వాలో లేక ఆ వ్యక్తిపై సానుభూతి చూపించాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తికి జరిగిన ప్రమాదం అంటువంటిది. ఇంతకీ ఏం జరిగింది అని అనుకుంటున్నారా?

man accidentally falls in drainage along with vehicle while reversing

సోషల్​ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు ఎలా వైరల్ అవుతుందో తెలియదు. దానిలో ఉంటే కంటెంట్​ ను బట్టి నెటిజన్లు విరివిగా షేర్ల మీద షేర్లు చేస్తుంటారు. అలాంటి వీడియోను భారీగా షేర్లు చేశారు. దీనిలో ఓ వ్యక్తి రివర్స్​ గేరులో వచ్చి ట్రాలీని పార్క్​ చేద్దాం అని భావిస్తాడు. అందుకని కొంచెం వెనక్కి వస్తాడు. అప్పుడు ఆ ప్రాంతం అంతా బాగానే ఉంటుంది. అయితే అతను పార్క్ చేసిన తరువాత అక్కడ ఉన్న సిమెంట్ పలకలు ఒక్క సారిగా విరిగిపోతాయి. దీంతో ఆ వ్యక్తి వెంటనే బస్తాలతో పాటు కింద పడిపోతాడు.

https://twitter.com/ViralHog/status/1493616094074097671?s=20&t=ExCkTgQQ4oxejG98bwFZGA

అయితే అతను పడిండి మురికి కాలువలో… అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని ఆ వీడియోను బట్టి చూస్తే తెలుస్తుంది. ఆ ట్రాలీ ఆటో మురికి కాలువలో పడిపోవడం అనేది అందరికీ నవ్వు తెప్పిస్తున్నా.. ఆ వ్యక్తి ఓ కూలి పని చేసేకుని జీవించే వ్యక్తి అందుకు చాలా మంది సానూభూతి చూపించి అయ్యో పాపం అంటూ కామెంట్లు చెప్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *