వైరల్ అవుతున్న రష్యా సైన్యం దురాగతాలు.. మాల్సులోకి జొరబడి..!

ఉక్రెయిన్​ తో రష్యా యుద్ధానికి దిగింది. ఇప్పటికే ఉక్రెయిన్​ లోని కీలక ప్రాంతాలను తన ఆధీనంలో తెచ్చుకుంది రష్యా. అంతేగాకుండా ఇంకా కొన్ని ప్రాంతాల్లోకి రష్యా సైనికులు ప్రవేశించారు. వాటిని కూడా తమ వశం చేసుకోవాలని భావిస్తున్నారు. మరో వైపు సైన్యాన్ని చూసిన ప్రజలు.. కేవలం ఇళ్లకు పరిమితం అయ్యారు. బయటకు వచ్చేందుకు ఎవరూ మొగ్గు చూపడం లేదు. దీంతో రష్యన్​ సేనలు వీర విహారం చేస్తున్నాయి. వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాయి. దొరికిన వాటిని అందినంత వరకు సర్దేస్తున్నాయి. కొన్ని సూపర్​ మార్కెట్లు లోకి వెళ్లి వారికి కావాల్సిన వాటిని తెచ్చుకుంటున్నారు ఆ దేశ సైనికులు. చేతిలో తుపాకీలను పట్టుకుని బెదిరిస్తున్నాయి.

Short Of Essential Supplies, Russian Troops Loot Local Stores In Konotop
Short Of Essential Supplies, Russian Troops Loot Local Stores In Konotop

అంతేగాకుండా వారు కొన్ని ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న వారిని భయాందోళనలకు గురి చేస్తున్నారు. వారు వాహనాలకు ఆయిల్ అయిపోతే బంకుల్లోకి వెళ్లి అక్కడున్న వారిని బెదిరించి దొరికిన కాడికి దోపిడీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రష్యా సేనలు చేసిన దురాగతాలకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అందులో ఒకదానిని నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు.

అందులో ఏం ఉంది అంటే.. న‌గ‌రాల్లోకి వెళ్లిన రష్యా సైనులు వారు ఇంధనం నింపుకునేందుకు వెళ్ళి అక్కడ ఉన్న మాల్సులోకి జొరబడి వారికి కావాల్సిన తినుబండారాలు, శీతల పానీయాలు, ఇంతర దుస్తులు లాంటి వాటిని లూటీ చేస్తున్నారు. ఒకరు గన్నుతో కౌంటర్ దగ్గర నిలుచుని ఉండగా… మిగతా వారు వారు కున్న వాటిని తీసుకుని వస్తున్నారు. వారు ఇలా చేసేన వీడియో సీసీటీవీల్లో నమోదు అయ్యింది. ఆ దృశ్యాలే ఇప్పుడు సమాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. అంతేగాకుండా రష్యా సైనికులు చేసిన ఈ చేష్టల మీద కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *