కుమార్తె వివాహ వేడుకలో మంత్రి డాన్స్.. నెట్టింట్లో వీడియో వైరల్​

ఎవరు ఎంత పెద్ద పదవిలో ఉన్నా.. ఫ్యామిలీ టైమ్ వచ్చేసరికి అవన్నీ మర్చిపోయి సరదాగా వారితో గడిపేందుకు ఇష్టపడుతుంటారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఆఖరికి సీఎం, పీఎం కానివ్వండి.. ఎవ్వరైనా ఫ్యామిలీ టైమ్​ అంటే.. వారి పదవులను పక్కన పెట్టి ఓ సాదా కుటుంబసభ్యుడిలా ఉండాల్సిందే. అలా క్రియేట్ చేస్తుంది ఫ్యామిలీ భంధం.

తాజాగా, ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమాలుపు సురేశ్​ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్​ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. తన కుమార్తె వివాహ వేడుకలో డాన్స్​లు వేస్తూ.. తనలోని మరో టాలెంట్​ను బయటపెట్టారు సురేశ్​. ఇటీవలే హైదరాబాద్​లో మంత్రి ఆదిమాలపు కుమార్తె శ్రిష్టి వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సీఎం జగన్ భార్య సహా పలువురు మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.

ఈ సందర్బంగా అతిథుల్లో ఉత్సాహం నింపేందుకు మంత్రి ఆదిమూలపు సురేశ్ తన కుమార్తెతో కలిసి స్టెప్పులేశారు. సై సినిమాలో నల్లా నల్లాని కల్లా పాటకు మంత్రి తన కుమార్తెతో కలిసి డాన్స్ వేయడంతో.. స్టేజ్​ కింద ఉన్న వారంతా ఈలలు గోలలు చేస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్​గా మారుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు మంత్రిపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.   మంత్రులు, ఎంపీలు ఇలా సరదాగా గడపడం కొత్తేం కాదు.. బాధ్యతల పరంగా ఎంత నిబద్దతో మెలుగుతారో.. ఫ్యామిలీ కోసం అంతే టైమ్ కేటాయిస్తూ.. ఇలా చిల్ అవుతుంటారు. దాని వల్ల వారికి కూడా ఈ టెన్షన్స్​ నుండి కాస్త ఉపశమనం లభించినట్లవుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *