బిడ్డను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన తల్లి.. వైరల్‌ వీడియో

ప్రపంచంలోని తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు. తనకంటే పిల్లల గురించే ఎక్కువ ఆలోచించే ఏకైక వ్యక్తి అమ్మ. ఏ ఆపద ఎదురైనా వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ప్రమాదం నుంచి పిల్లలను రక్షించుకునేందుకు చివరికి తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా త్యాగం చేస్తోంది. తాజాగా తల్లి ప్రేమకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఐఏఎస్ అధికారిణి సోనాల్ గోయెల్ ఓ జింకపై దాడి చేయబోతున్న మొసలి వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

Mother deer dies while saving her baby from crocodile attack viral video

ఇందులో నదిలో ఆకలితో ఉన్న ఓ మొసలికి కొంత దూరంలో జింక పిల్ల ఈత కొడుతూ కనిపించింది. జింకను ఆహారంగా చేసుకోవాలని భావించిన మొసలి.. దానిని పట్టుకునేందుకు వేగంగా కదులుతుంది. అయితే కొంత దూరంలో ఉన్న తల్లి జింక రాబోయే ప్రమాదాన్ని గమనించి.. తన బిడ్డను రక్షించుకునేందుకు వెంటనే నీటిలోకి దూకి రెండింటి మధ్యలోకి వస్తుంది. బిడ్డ ప్రాణాన్ని కాపాడటానికి మొసలికి ఆహారంగా మారిపోయింది. తన ప్రాణ త్యాగంతో బిడ్డను రక్షించుకుంది. తల్లి జింకను నోట కరుచుకుని మొసలి అక్కడి నుంచి వెళ్లిపోయింది. పిల్ల జింక ఒంటరిగా మిగిలిపోయింది. గడ్డపైకి చేరిన పిల్ల జింక బిక్కుబిక్కుమంటూ తల్లికోసం చూసింది. తల్లి ప్రేమను వర్ణించేందుకు మాటలు సరిపోవని, బిడ్డను రక్షించుకునేందుకు తల్లి జింక చేసిన ప్రాణత్యాగం హృదయాన్ని కదిలిస్తోందన్నారు ఐఏఎస్​ఆఫీసర్ ​సొనాల్​గోయల్.

తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను ఎప్పటికి విడిచిపెట్టకూడదని ఈ వీడియో మనకు గుర్తుచేస్తోందన్నారు. వాళ్లని గౌరవించాలి, వారికి సేవ చేయాలని ట్వీట్టర్‌లో రాసుకొచ్చారు ఐఏఎస్​ఆఫీసర్​ సొనాల్​ గోయల్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ హృదయ విదారక ఘటన గుండెల్ని పిండేస్తోందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *