మెట్రోలో సీటు కోసం యువకుడి వింత ప్రవర్తన… తట్టుకోలేక పోరిపోయిన ప్రయాణికులు !

మనలో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. మన అవసరాన్ని బట్టి సీటు ఉన్నా.. లేకున్నా.. ఎలాగోలా ప్రయాణాన్ని పూర్తి చేస్తారు. కానీ కొంత మంది అలా ఉండరు. వారికి కచ్చితంగా సీటు కావాలి. ఎలా అయినా సీటు సంపాదించాలని చూస్తుంటారు. లేకుంటే వారికి ప్రయాణం చేసినట్లు ఉండదు. మరికొందరికి అయితే విండో సీటు కావాల్సి ఉంటుంది. దాని కోసం కావాలంటే పోట్లాడుతారు. ఎంత లొల్లి అయినా పెట్టుకుంటారు. అయితే ఇలాంటి డిఫ్రెంట్​ క్యాండిట్లు మన పక్కన కూడా ఉంటారు. అయితే ఇలాంటి ఓ యువకుడు సీటు కోసం చేసిన ఓ వింత ప్రవర్తన ఇప్పుడు సామాజిక మధ్యమాల్లో వైరల్​ గా మారింది.

a man acts nausea and vomiting to get seat in metro train video goes viral

ప్రస్తుత కాలంలో మెట్రో రైలు అనేది చాలా మంది ఎక్కే ఉంటారు. ఆఫీసుకు పోవాలన్నా.. రావాలన్నా.. సుఖమైన ప్రయాణంగా దీనిని చాలా మంది ఎంచుకుంటున్నారు. అందులోనూ ట్రైన్​ అంతా ఏసీ ఉండడం.. దుమ్ము దూళీ లాంటివి ఏమీ పడక పోవడంతో దీనిని చాలా మంది ప్రయాణానికి మంచిగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ఓ మెట్రో ట్రైన్​ లో ఓ వ్యక్తి చేసిన ప్రవర్తన నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తుంది. ఇందుకు ఆ వ్యక్తి నటనలో తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించాడు. ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసుకుందాం.
ఆ మెట్రో ట్రైన్​ పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయింది. సీటు దొరకని ఆ యువకుడి పన్నాగం పన్నాడు. ముందగా ట్రైన్​ ఎక్కిన ఆ యువకుడు తలుపు దగ్గర నిలబడ్డాడు.

https://www.instagram.com/reel/CaFSAFrjDpJ/?utm_source=ig_web_copy_link

ఎలాగైనా సీటు సంపాదించాలని ప్రయత్నించాడు. కానీ కుదిరేలా లేదు అని భావించాడు. అయితే ప్రయాణాల్లో కొందరికి వాంతి అవుతుంటాయి. దీనే అసరాగా చేసుకున్నాడు. ఉన్నట్టుండి ఆరోగ్యం బాగోలేదని వాంతులు కాబోతున్నట్లు నటించడం స్టార్ట్​ చేశాడు. ఆ వ్యక్తి చేసిన వింత ప్రవర్తన చూసిన అక్కడ వారి మీద వాంతి చేసుకుంటాడు అనుకుని పరుగులు తీశారు. దీంతో క్షణాల్లోనే సీట్లు ఖాళీ అయ్యాయి. అనంతరం ఆ యువకుడు ఏం పట్టనట్టు వచ్చి కూర్చున్నాడు. జోబులో ఉన్న ఫోన్​ తీసుకుని సరదాగా నొక్కుకున్నాడు. ఈ ప్రవర్తన ఇప్పుడు సోషల్​ మీడియోలో వైరల్ అవుతోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *