సింహం నోట్లో చెయ్యి పెట్టాడు… ఏమైందో తెలుసా..?

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాహసం చేయడం… అది వీడియో తీయడం… దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం… అది కాస్తా వైరల్ అవ్వడం ఇదంతా ఈరోజుల్లో కామన్ అయిపొయింది. సామాజిక మాధ్యమాలలో ఫేమస్ అవ్వడం కోసం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.క్రూర మృగాలు అన్న తర్వాత వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. జోకులు, పరాచకాలు అస్సలు పనికిరావు. వాటి దగ్గర ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా… మనల్ని వాటి లంచ్ మెనూలో చేర్చుకుంటాయి. ముఖ్యంగా అడవికి రాజైన మృగరాజు విషయంలో కేర్ లెస్ అస్సలు పనికిరాదు. ఏమాత్రం తేడా వచ్చినా… అది తన పంజా విసురుతుంది. తర్వాత దాని నోటికి పని చెబుతుంది.

Lion 'bites off' man's finger at Jamaica zoo in horrifying footage

ఇలాంటి ఓ ఘటనే జమైకాలోని ఓ జంతుప్రదర్శనశాలలో చోటుచేసుకుంది. ఇక్కడి జూ కీపర్‌ అత్యుత్సాహంతో కంచె లోపలికి తన చేతిని దూర్చి సింహాన్ని ఆటపట్టిస్తుండగా.. ఒక్కసారిగా ఆ మృగం అతని చేతివేళ్లను నోటకరచుకుంది. ఎంత గింజుకున్నా విడవకపోవడంతో.. చివరకు అతను ఉంగరపు వేలిని పూర్తిగా కోల్పోయాడు. గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. సింహం తన వేళ్లను పట్టున్నప్పుడు అతను చేతిని వెనక్కి లాగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

https://twitter.com/Morris_Monye/status/1528317584512368640?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1528317584512368640%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-988568916353891934.ampproject.net%2F2205051832000%2Fframe.html

తన వేలిని వెనక్కి లాక్కోవడానికి నానా తంటాలు పడ్డాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్నవారెవరూ అతన్ని కాపాడే ప్రయత్నం చెయ్యలేదు. తిక్క కుదిరింది అన్నట్లు చూశారు. పైగా వాళ్లంతా ఇలాంటి సీన్ మళ్లీ దొరకదు అన్నట్లు తమ మొబైల్‌లో వీడియో రికార్డ్ చేయసాగారు. కొన్ని క్షణాలపాటూ… నరకం చూసిన అతను మొత్తానికి వేలిని వెనక్కి లాక్కోగలిగాడు. అప్పటికే ఆ వేలికి తీవ్ర గాయమైంది. ఆ వేలికి ఎముక తప్ప చర్మం లేదని తెలిసింది. ట్విట్టర్‌లోని @OneciaG అకౌంట్‌లో మే 22, 2022న ఈ వీడియోని పోస్ట్ చెయ్యగా… ఇప్పటివరకూ 36 లక్షల మందికి పైగా చూశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *