సైనికుల సాహసం.. వీడియో వైరల్..

ఉత్తరాఖండ్ ను దేవ భూమిగా పిలుస్తారు. ఇక్కడ ఎక్కువగా దేవాలయాలు ఉంటాయి. భక్తులు కూడా ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే ఇక్కడ తాజాగా జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ ప్రవహించే గంగా నదిలో కొట్టుకుపోతుండగా కొందరు వీడియో తీశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో వైరల్ గా మారింది.

indian army saved lives of two girls in rishikesh
indian army saved lives of two girls in rishikesh

ఇదిలా ఉంటే ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని ప్రధాన ప్రాంతాల్లో ఒకటి అయిన రిషికేశ్ లో జరిగింది. ఇక్కడకు వచ్చి ఇద్దరు అమ్మాయిలు స్థానికంగా ఉండే బోటుల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఇది జరిగింది. వారు పొరపాటున బోటు నుంచి కింద పడినట్లు స్థానికులు చెప్తున్నారు. వారు వచ్చిన బోటు మాత్రం ముందుకు సాగిపోగా.. వారు మాత్రం నదిలో చిక్కుకుపోయినట్లు చెప్పారు.

ఈ క్రమంలో అక్కడే ఉన్న కొందరు సైనికులు వారి రక్షించారు. దీంతో ఆ ఇద్దరు యువతులను కాపాడారు. తాము గాని రక్షించకపోతే వారు గంగా నదిలో కొట్టుకుపోయే వారు అని అధికారులు చెప్పారు. వారిని ప్రమాదం నుంచి రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఇక్కడకు వచ్చి పర్యాటకులు కొన్ని ప్రాంతాలను వీక్షించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సైనికులు రక్షించిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను అక్కడ ఉన్న జవానులు వీడియో తీసి సోషల్ మీడియో పోస్ట్ చేశారు. దీంతో చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు కూడా విపరీతంగా దీనిని షేర్ చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *