రష్యా సైన్యాన్ని ఒక్క చేత్తో అడ్డుకున్న పౌరుడు.. వీడియో వైరల్!

రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్దం కొనసాగుతూనే ఉంది. రష్యా దళాలు ఉక్రెయిన్ పై ఇంకా మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నాయి. క్రమ క్రమంగా ఒక్కొక్క నగరాన్ని రష్యా సేనలు సొంతం చేసుకుంటున్నారు. చాలా నగరాల్లో ఇప్పటికే బాంబుల మోత కొనసాగుతూనే ఉంది. కానీ ఉక్రెయిన్ పౌరులు కూడా అదే స్థాయిలో దీటైన సమాధానం ఇస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు నింపిన స్పూర్తితో రష్యా సేనలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. అయితే ఇలాంటి వీడియో ఇప్పుడు ఒకటి సోషల్​ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ వ్యక్తి రష్యా సేనలు యుద్ధ ట్యాంకర్ ను నగరంలోకి తీసుకుని పోతుంటే అడ్డుగా నిలబడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​ గా మారింది.

man stops russian army
man stops russian army

ఇప్పటికే తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఉక్రెయిన్ లోని ప్రతీ ఒక్క పౌరుడు ముందుకు వస్తున్నాడు. ఇదే నేపథ్యంలో తమ మాతృభూమిని కాపాడుకోవడానికి రష్యా చెందిన బలగాలను ఓ రేంజిలో ఎదిరించి ధైర్యంగా ముందు నిలబడుతున్నారు. ఇలాంటిదే ఈ వీడియో కూడా. దీనిలో ఆ వ్యక్తి యుద్ధ ట్యాంకర్​ కు ఎదురెల్లాడు. బఖ్​మాచ్​ నగరంలో ఉండే ఓ పౌరుడు.. రష్యా బలగాలను తమ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకున్నాడు. యుద్ధ ట్యాంకర్ ముందుకు వెళ్లి మోకాళ్ల మీద ఓ కూర్చుకున్నాడు. అతన తన వ్యతిరేకతను రష్యా బలగాలకు తెలిపాడు. ట్యాంకర్ ముందుకు కదులుతున్న సరే ఏ మాత్రం తమకకుండా అలానే ఉండిపోయాడు.

ఇదిలా ఉంటే తన ప్రాణాన్ని సైతం గడ్డి పూచగా నిలిపి సైన్యం ముందుకు వెళ్లిన ఆ వ్యక్తిని చాలా మంది అభినందిస్తున్నారు. అంతేగాకుండా ఇంకా చాలా మంది పౌరులు ఆ వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని కదన రంగం లోకి దూకుతున్నారు. పుతిన్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *