పచ్చిమిర్చి హల్వా… ఇదెక్కడి వంటకం రా.. బాబూ..!

పుర్రెకో బుద్ధి… జిహ్వకో రుచి అని ఎవడు అన్నాడో తెలియదు కానీ.. ఇప్పుడు మన స్టోరీ చదివితే నిజమే అని అనిపిస్తుంది. చాలా మందికి వింత వింత వంటకాలు ట్రై చేయడం అన్నా…. వింత వింత వంటకాలు టేస్టు చేయడం అన్నా కానీ చాలా ఇష్టం ఉంటుంది. అయితే వారు టేస్టు చేసినవి ప్రపంచానికి చూపించాలని తాపత్రయ పడే వారి సంఖ్య రోజు రోజుకు బాగా పెరిగిపోతుంది. అయితే ఇలాంటి వారు తీసిని ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యాల్లో వైరల్ గా మారింది. ఆ వంటకమే పచ్చి మిర్చి హల్వా.

green chilli halwa going viral on social media
green chilli halwa going viral on social media

అయితే ఇప్పటివరకూ మనలో చాలా మంది క్యారెట్ హల్వా, బ్రెడ్ హల్వా, బీట్రూట్ హల్వా లాంటివి విన్నాం. అంతే కాకుండా మనలో చాలా మంది వాటి రుచిని కూడా చూసి ఉంటారు. అయితే కొత్తగా వచ్చిన ఈ పచ్చి మిర్చి హల్వా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. పచ్చి మిర్చి తో హల్వా తయారు చేయడం ఏంట్రా బాబు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి అని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటివరకూ పచ్చిమిర్చిని వివిధ రకాలైన వంటకాలు వండే దానికి ఉపయోగిస్తుంటే… వాటితో హల్వా చేయడం కొత్తగా ఉందని అంటున్నారు. అయితే ఈ కొత్త గా చేసినా పచ్చి మిర్చి హల్వా… చట్నీ లాంటిది అని అనుకుంటే పొరపాటే అని చెప్తున్నారు. ఇది కచ్చితంగా హల్వా కిందకే వస్తుందని అంటున్నారు. అయితే ఈ పచ్చి మిర్చి హల్వాను ఎంత మంది తిన్నారు అనేది ఇంత వరకు తెలియదు. కొందమంది అయితే ఇలాంటి హల్వాను తొలిసారి చూస్తున్నాం అని కామెంట్ చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *